దళితుల అభ్యున్నతి విస్మరించిన కాంగ్రెస్ : మనోహర్‌లాల్ ఖట్టర్
కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎప్పుడూ గందరగోళానికి గురిచేస్తుందని హరియాణ మాజీ సీఎం, కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఎప్పుడూ గందరగోళానికి గురిచేస్తుందని హరియాణ మాజీ సీఎం, కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ఆరోపించారు. గతంలో ప్రజలు కాంగ్రెస్ తీరుతో గందరగోళానికి గురయ్యేవారని, కానీ దళితుల ప్రయోజనాలను కాపాడేది ఎవరో ఇప్పుడు వారికి అర్ధమవుతున్నదని, వారంతా బీజేపీనే తమను కాపాడుతుందని నమ్ముతున్నారని చెప్పారు.
ఖట్టర్ సోమవారం హరియాణలోని కురుక్షేత్రలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త రికార్డును సృష్టిస్తుందని అన్నారు. మూడోసారి హరియాణాలో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. జన్మాష్టమి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానని చెప్పారు.
ఈ సందర్భంగా తాను బాబా సాహెబ్ అంబేడ్కర్, గురు రవిదాస్‌ను గుర్తుకు తెచ్చుకుని వారికి నివాళులు అర్పించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంతోమంది దళితులు, అణగారిన వర్గాల వారు పాల్గొన్నారని, ఈ సమావేశంలో కీలక రాజ్యాంగ అంశాలు, రిజర్వేషన్ల గురించి చర్చించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, బీసీలు, అణగారిన వర్గాల గురించి కేవలం మాటలు మినహా వారి అభ్యున్నతికి ఎలాంటి చర్యలూ చేపట్టలేదని చెప్పారు. దళితుల అభ్యున్నతికి పనిచేసే పార్టీ బీజేపీయేనని ఆయన పేర్కొన్నారు.
What's Your Reaction?