39 Runs in Single Over : ఒక్క ఓవర్ లో 39 రన్స్.. రికార్డ్ నెలకొల్పిన సమోవా టీమ్ బ్యాట్స్ మన్
టీ20 ప్రపంచ కప్ 2026 మెగా టోర్నీ కోసం క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈస్ట్ ఆసియా-పసిఫిక్ సబ్ రీజనల్‌లో భాగంగా సమోవా-వనువాటు దేశాల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ క్రమంలో సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టిన ఆటగాళ్ల లిస్ట్ లో చేరాడు. కానీ, వరుసగా మాత్రం కొట్టలేదు. ఒకే ఓవర్‌లో 39 పరుగులు రాబట్టాడు. సమోవా ఇన్నింగ్స్‌లోని 15వ ఓవర్‌ను వనువాటు బౌలర్ నిలిన్ నిపికో వేశాడు. సమోవా బ్యాటర్ డేరియస్ విస్సెర్ ఆరు సిక్స్‌లు కొట్టాడు. అదనంగా మూడు నో బాల్స్ కూడా పడటంతో.. ఒకే ఓవర్‌లో ఎక్కువ పరుగులు వచ్చాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఇప్పటి వరకు యువీ కాకుండా.. కీరన్ పొలార్డ్, నికోలస్ పూరన్ , దీపేంద్ర సింగ్ (2024) మాత్రమే 36 రన్స్ చేశారు. సమోవా తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగానూ డేరియస్ రికార్డు సృష్టించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సమోవా నిర్ణీత 20 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. డేరియస్ సెంచరీ కొట్టగా.. కెప్టెన్ కలేబ్ జస్మత్ 16 రన్స్ చేశాడు. అనంతరం చేజింగ్ కు దిగిన వనవాటు టీమ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 రన్స్ చేసింది. దీంతో 10 పరుగుల తేడాతో సమోవా గెలుపొందింది.

What's Your Reaction?