మంచి చేసే ప్రభుత్వం-విద్యవికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం-డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

మంచి చేసే ప్రభుత్వం-విద్యవికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం-డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

Jan 4, 2025 - 18:22
 0  70
మంచి చేసే ప్రభుత్వం-విద్యవికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం-డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి

దర్శి నియోజకవర్గం దర్శి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకాన్ని దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్శి టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ఇప్పటివరకూ లేని విధంగా ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మధ్యాహ్న బడి భోజనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగం. కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. మాది ప్రజల ప్రభుత్వం... మంచి చేసే ప్రభుత్వం విద్యవికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం.

విద్యార్థుల ఆకలి తీర్చడం ఒక్కటే మా లక్ష్యం కాదు.. రుచికరమైన, ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం మా ప్రభుత్వం బాధ్యత. ప్రాంతాల వారీగా ఆహారపు అలవాట్లను గౌరవిస్తూ ఆయా ప్రాంత ఆహార పదార్థాలను ఆయా స్కూళ్లలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా అందిస్తున్నాం. విద్యార్థుల ఆకలి తీర్చే మిడ్ డే మీల్స్ పోషకాహార లోపాన్ని నివారించి, విద్యార్థులను ఆరోగ్యంగా తీర్చిదిద్దేలా అందిస్తున్నాం. విద్యార్థుల ఉత్తమ అభ్యాస ఫలితాలను సాధించడానికి ఉపయోగపడుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంను ఇప్పుడు ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది.

ఆకలి తీర్చి అన్నపూర్ణమ్మ మహాతల్లి డొక్కా సీతమ్మ గారి పేరు ఈ పథకానికి పెట్టడం మా ప్రభుత్వం ఈ పథకానికి ఎంత ప్రాధాన్యం ఇస్తుందో తెలియజేశాం. రాష్ట్రవ్యాప్తంగా 44,119 పాఠశాలల ద్వారా 33,81,041 విద్యార్థులకు మిడ్ మీల్స్ అందిస్తున్నాం. 14 జిల్లాల్లో 23 సెంట్రలైజ్డ్ కిచెన్స్ ద్వారా 6 NGOలు MDMని అందజేస్తున్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం కోసం కేంద్ర ప్రభుత్వం 432 కోట్లు ఇస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం 1422 కోట్లు ఇస్తోంది. మొత్తంగా ఏడాదికి 1854 కోట్లతో పథకాన్ని సమర్ధవంతంగా, పారదర్శకంగా అమలు చేస్తున్నాం. విద్యార్థులకు 6 రోజులు ఆరు రకాల మెనూ వండి వడ్డిస్తున్నారు. విద్యార్థులకు వారానికోసారి 5 రోజుల ఉడికించిన గుడ్డు, 3 రోజుల వేరుశెనగ బెల్లం చిక్కీ,3 రోజులు రాగి జావ అందిస్తున్నాం. పబ్లిసిటీ ఆర్భాటాలు లేకుండా... రియాలిటీకి దగ్గరగా, విద్యార్థులు,, వారి తల్లిదండ్రులు, టీచర్లు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలతో చర్చించి వారి అభిప్రాయాల మేరకు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. విద్యార్థులకు అందించే ఆహారం మెనూలో వారు కోరిన మార్పులు చేసేందుకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో వర్క్ షాపులు నిర్వహించారు. న్యూట్రిషనిస్టులు, వైద్యులు, నిపుణుల నుండి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం.

ప్రాంతాల వారీగా ఇష్టంగా తినే ఆహారపదార్థాలు వారి ముందు ఉంచాం. స్థానికంగా లభించే పదార్థాలు, ప్రాంతీయ ఆహారపు అలవాట్లు, రుచి, వాటిలో పోషక విలువలు నిపుణులు గుర్తించిన తరువాతే మెనూలో మార్పులకు శ్రీకారం చుట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడిభోజనం పకడ్బందీగా అమలు చేయడానికి పాఠశాల స్థాయి, గ్రామ స్థాయి, థర్డ్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 4 అంచెల నిర్మాణాన్ని ఏర్పాటు చేసింది.IMMS యాప్, డ్యాష్ బోర్డ్ ద్వారా తనిఖీలను పర్యవేక్షిస్తున్నాం. నాణ్యమైన ఆహారపదార్థాలు, గుడ్లు సరఫరా కోసం టెండర్లు పిలిచి పారదర్శకంగా సరఫరాదారులను ఖరారు చేశాం. గత టెండర్లతో పోల్చితే గుడ్ల రవాణా ఖర్చు 25%కి తగ్గింది. పాఠశాలలకు గుడ్లు సకాలంలో సరఫరా అవుతున్నాయో లేదో పర్యవేక్షణ కోసం GPS ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News