Shiekh Hasina: షేక్ హసీనా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
మరోనాలుగు మర్డర్ కేసులు కలిపి మొత్తం 44 మర్డర్ కేసులు..
రిజర్వేషన్ కోటా రద్దు ఆందోళనలు చివరకు బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయేలా చేశాయి. ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. షేక్ హసీనా దేశం వదిలినప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. తాజాగా షేక్ హసీనాతో పాటు ఆమె మాజీ కేబినెట్ మంత్రులు, సహాయకులపై మరో నాలుగు హత్య కేసులు నమోదు అయ్యాయని ఆదివారం మీడియా నివేదికలు తెలిపాయి.
2010లో అప్పటి బంగ్లాదేశ్ రైఫిల్స్(బీడీఆర్) అధికారి అబ్దుల్ రహీమ్ మృతిపై హసీనా, బంగ్లాదేశ్ బోర్డర్ గార్డ్ మాజీ డైరెక్టర్ జనరల్ అజీజ్ అహ్మద్‌తో పాటు మరో 11 మందిపై ఆదివారం హత్య కేసు నమోదైంది. 2010లో పిల్ఖానాలో జరిగిన మారణహోమంపై నమోదైన కేసులో మాజీ బీడీఆర్ డిప్యూటీ అసిస్టెంట్ డైరెక్టర్ రహీమ్ నిందితుడిగా ఉన్నాడు. అదే ఏడాది జూలై 29న జైలు కస్టడీలో మరణించాడు. రహీమ్ కుమారుడు అడ్వకేట్ అబ్దుల్ అజీబ్ ఢాకా మేజిస్ట్రేట్ ముందు కేసు దాఖలు చేశారు.
జూలై 18న వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమంలో మిలిటరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (MIST) విద్యార్థిని హత్య చేసినందుకు హసీనాతో పాటు మరో 48 మందిపై ఆదివారం మరో హత్య కేసు నమోదైంది. బాధితుడు షేక్ అషాబుల్ యెమిన్ మామ అబ్దుల్లా అల్ కబీర్ ఢాకా సీనియర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఎండీ సైఫుల్ ఇస్లాం కోర్టులో 49 మంది నిందితులపై కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. పిటీషన్ స్వీకరించిన కోర్టు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసులో అవామీ లీగ్ ప్రధాని కార్యదర్శి, రోడ్డు రవాణా, వంతెలన శాఖ మాజీ మంత్రి ఒబైదుల్ క్వాడర్, మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ తదితరులను నిందితుగా చేర్చారు.
ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా ఢాకాలలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఉత్పత్తుల విక్రయదారుడి హత్యపై హసీనాతో పాటు మరో 27 మందిపై కేసులు నమోదైంది. బాధితుడిత తరుపున అతడి బావం కేసు నమోదు చేశారు. ఈ కేసులో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి ఒబైదుల్ క్వాడర్ మరియు మాజీ మంత్రులు అనిసుల్ హుక్ , తాజుల్ ఇస్లాం నిందితులుగా ఉన్నారు. ఇటీవల జరిగిన నిరసనల సందర్భంగా రాజధానిలో ఆటో రిక్షా డ్రైవర్‌ను హత్య చేయడంపై హసీనా సహా 25 మందిపై మరో కేసు నమోదైంది.
ప్రస్తుతం షేక్ హసీనాపై 53 కేసులు నమోదయ్యాయి. ఇందులో 44 హత్యలు, ఏడు మానవత్వం, మారణహోమం కేసులు ఉన్నాయి. మరొకటి కిడ్నాప్, ప్రతిపక్ష బీఎన్‌పీ ఊరేగింపుపై దాడి కేసులు ఉన్నాయి. హసీనా ప్రభుత్వ పతనం తర్వాత దేశవ్యాప్తంగా చెలరేగిన హింసాత్మక సంఘటనలలో బంగ్లాదేశ్‌లో 230 మందికి పైగా మరణించారు. మొత్తంగా రిజర్వేషన్ కోటా విషయంలో మరణించిన వారి సంఖ్య 600కి పైగా మంది మరణించారు.
What's Your Reaction?