ACB : అవినీతికి పాల్పడుతూ.. ఏసీబీకి చిక్కిన విద్యుత్ శాఖ డీఈ
అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ.. అది సరిపోదన్నట్టుగా అవినీతికి పాల్పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పనికి సంబంధించిన ఫైల్ మూవ్ కావాలంటే చేతులు తడపాల్సిన పరిస్థితి నెలకొంది. లంచగొండి అధికారులపై ఏసీబీ అధికారులు నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ఉద్యోగుల్లో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా వనస్థలిపురం విద్యుత్ శాఖ డీఈని ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గురువారం ఆటోనగర్‌లోని డీఈ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా వనస్థలిపురం విద్యుత్ శాఖ డీఈ రామ్మోహన్ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.

What's Your Reaction?