ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మణుగూరు సీఐ-బిగ్ టీవీ రిపోర్టర్
ACB Raids: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మణుగూరు సీఐ-బిగ్ టీవీ రిపోర్టర్

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మణుగూరు సిఐ. సీఐ కి మీడియేటర్ గా వ్యవహరించిన బిగ్ టీవీ రిపోర్టర్
భద్రాద్రి జిల్లా: ఏప్రిల్21 మణుగూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ భూమి కేసులో 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుపడ్డాడు. మణుగూరు సీఐ సతీష్ కుమార్... సోమవారం ఖమ్మం ఏసీబీ అధికారులు వలపన్ని అడ్డంగా పట్టుకున్నారు. సోమవారం ఏసీబీ అధికారులు విషయం తెలుసుకుని మణుగూరు పోలీస్ స్టేషన్ పైఈరోజు సాయంత్రం మెరుపు దాడి చేశారు. మణుగూరు మండల కేంద్రంలో సీఐ సతీష్ కుమార్ గత నెల రోజుల నుంచి ఓ భూమి విషయంలో తల దూర్చి బాధితులను ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలిసింది.
ఆ భూమి విషయంలో సీఐ సదరు బాధితులను బెది రించినట్లు తెలుస్తుంది. అయితే సీఐకి మధ్యవర్తిగా మణుగూరు మండల బిగ్ టీవీ రిపోర్టర్ గోపి మీడి యేటర్ గా వ్యవహరించి డబ్బులు వసూళ్లు చేసినట్లు సమాచారం. అయితే భూమి విషయంలో 4లక్షలు రూపాయలు డిమాండ్ చేయగా ఒక లక్ష రూపా యలు సదరు భాదితులు ఇచ్చినట్లు తెలిసింది. ఆ లక్ష రూపాయలు సీఐ తీసుకోవడంతో ఏసీబీ అధికారులు రెడ్ హాండ్ గా రాసాయనిక పరీక్షలు చేసి అభియోగాలకి బలమైన ఆధారాలు సేకరించి పట్టుకున్నారు. సీఐతో పాటు మధ్యవర్తిగా వ్యవహరించినందుకు బిగ్ టీవీ రిపోర్టర్ గోపి పట్టుకున్నారు. వీరిపై కేసు చేయగా సీఐ సతీష్ ని A1,రిపోర్టర్ గోపి A2 గా చేశారు.
వీరిపై సెక్షన్లు: 318(4), 329(3) BNS & తెలంగాణ స్టేట్ గేమింగ్ సవరణ చట్టం సెక్షన్ 5 కేసు నమోదు చేశారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి వరంగల్ ఎస్పీఈ,ఎసీబీ కోర్టులో హాజరుపరిచారు.
What's Your Reaction?






