Actress Hema : నటి హేమపై సస్పెన్సన్ ఎత్తేసిన ‘మా’
కొన్నాళ్ల క్రితం బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లింది అనే ఆరోపణలతో అరెస్ట్ అయింది నటి హేమ. మొదట తను ఆ పార్టీలో లేను అని చెప్పే ప్రయత్నం చేసినా.. బెంగళూరు పోలీస్ లు ఆధారాలతో సహా ముందస్తుగా నోటీస్ లు ఇచ్చి విచారణకు రమ్మన్నారు. కానీ హేమ విచారణకు హాజరు కాలేదు. చివరికి కర్ణాటక పోలీస్ లు వచ్చి ఆమెను తీసుకువెళ్లి విచారించారు. ఆ సమయంలో హేమ ప్రవర్తించిన విధానంపై అనేక విమర్శలు కూడా వచ్చాయి. చివరికి ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ’ఆమెపై సస్పెన్సన్ వేటు వేసింది. అయినా తను తప్పు చేయలేదు అనే చెప్పుకు వచ్చింది హేమ. ఈ మధ్య కాలంలో కూడా కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో అదే స్పష్టం చేస్తూనే.. కావాలనే కొన్ని మీడియా సంస్థలు తనను తప్పుగా చిత్రీకరించారని మీడియాపై ఆరోపణలు చేసింది. అలాగే ఆ మీడియా సంస్థలకు పరువు నష్టం నోటీస్ లు పంపిస్తా అని కూడా చెప్పింది. మరి బెంగళూరు విచారణలో ఏమైందో కానీ.. తాజాగా హేమపై సస్పెన్సన్ ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది మా. ఈ మేరకు మంచు విష్ణు తీసుకున్న నిర్ణయాన్ని కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా అంగీకరించారని.. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు. అలాగే ఈ సస్పెన్సన్ ఎత్తివేత గురించి కానీ, ఈ వ్యవహారం గురించి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీడియాతో మాట్లాడొద్దని హేమకు సూచించింది మా.

What's Your Reaction?