Addanki Dayakar : మోడీ రాముడు కాదు : అద్దంకి దయాకర్
ప్రధాని మోడీ రాముడు కాదు.. మోడీ లాంటి కోట్ల మందికి శ్రీ రాముడు దేవుడని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక వీడియో విడుదల చేశారు. ‘వ్యక్తిగతంగా నా జీవితంలో కూడా మా తండ్రి పేరు రామ లక్ష్మయ్య, నా పిల్లల పేర్లు కూడా.. నా మొదటి బిడ్డ పేరు ఆత్మజ రామ్, రెండో బిడ్డ పేరు ముక్త శ్రీ, కొడుకు పేరు జానకి రామ్ వినయ్. నా కుటుంబంలోనే రాముడు ఉన్నాడు. వీడెక్కడి నుంచి మధ్యలో హిందూ అనే పేరు మీద రాజకీయం చేసుకోవడానికి హిందువుగా మారిండు. నేను ఇంకా స్పష్టంగా చెబుతున్న మీకేం పేటెంట్ రైట్స్ ఇవ్వలేదు. ఒక పదివేల సంవత్సరాల తర్వాత బీజేపీ పుట్టును, దానికి హిందుత్వం అనేది పేటెంట్ హక్కు రాసి ఇవ్వబడును. మిగతా వాళ్లు ఎవరూ కూడా హిందువుగా చెప్పుకోవద్దు, బీజేపీలో ఉంటేనే హిందువు, నేను అంటున్న ఈ రోజు ఈ దేశంలో ఉన్నవాళ్లందరూ హిందువులు అని మీ ఆర్ఎస్ఎస్ ఆయనే అన్నాడు. మరి మీకెందుకు ఈ వివక్ష, ఎస్సీ, ముస్లీం, క్రిస్టియన్ అంటే పడదు’ అని అద్దంకి తీవ్ర విమర్శలు చేశారు.

What's Your Reaction?