Adivi Sesh Goodachari 2 : అడవి శేష్ సినిమాకు అంత బడ్జెట్టా

అడవి శేష్.. చిన్న పాత్రలతో మొదలై.. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. శేష్ సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అనేలా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్ లపైనా అతనికి మంచి అవగాహన ఉంది. అన్నిటికీ బాస్ లాంటి స్క్రిప్ట్ విషయంలో పట్టు ఉంది. స్వయంగా రాయగలడు. ఇవే అతన్ని ఇతర హీరోలకు భిన్నంగా చూపిస్తాయి. ప్రస్తుతం డెకాయిట్ తో పాటు గూఢచారి 2 మూవీస్ చేస్తున్నాడు శేష్. గూఢచారి 1 చేసినప్పుడు అతని బడ్జెట్ 5 కోట్ల వరకూ మాత్రమే. కానీ అవుట్ పుట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుంది. నిజానికి శేష్ రేంజ్ మార్చింది.. ఈ మూవీయే.అందుకు గూఢచారికి సీక్వెల్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గానే ఈ సీక్వెల్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత అతని గురించి తెలిసింది కాబట్టి ఈ చిత్రానికి ఏకంగా 100 కోట్ల బడ్జెట్ వచ్చిందట. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ప్రొడ్యూసర్స్ కు బడ్జెట్ గురించిన పట్టింపులు లేవు. అందుకే దర్శకుడు అడిగినంత అమౌంట్ సెట్ చేశారట. దీంతో గూఢచారి 2 వంద కోట్ల ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్ ను శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేశాడు. ఈ సీక్వెల్ ను మాత్రం వినయ్ కుమార్ సరిగినీడి డైరెక్ట్ చేస్తున్నాడు. రెండు కథలనూ రాసుకుంది అడవి శేషే. ఈ పార్ట్ లో ఇమ్రాన్ హష్మీ, మధుశాలినితో పాటు సుప్రియా యార్లగడ్డ కూడా కనిపించబోతున్నారు. సో.. ఇక ఈ సారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇంకా చెబితే ఓ మిషన్ ఇంపాజిబుల్, జేమ్స్ బాండ్ తరహా కంటెంట్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో. మొత్తంగా ఈ రేంజ్ లో బడ్జెట్ పెరిగిన సీక్వెల్ ఈ మధ్య కాలంలో కాంతార తర్వాత గూఢచారి 2 అనే చెప్పాలి. 

Aug 28, 2024 - 17:07
 0  1
Adivi Sesh Goodachari 2 : 
అడవి శేష్ సినిమాకు అంత బడ్జెట్టా

అడవి శేష్.. చిన్న పాత్రలతో మొదలై.. ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. శేష్ సినిమా అంటే మాగ్జిమం గ్యారెంటీ అనేలా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. సినిమాకు సంబంధించి అన్ని క్రాఫ్ట్ లపైనా అతనికి మంచి అవగాహన ఉంది. అన్నిటికీ బాస్ లాంటి స్క్రిప్ట్ విషయంలో పట్టు ఉంది. స్వయంగా రాయగలడు. ఇవే అతన్ని ఇతర హీరోలకు భిన్నంగా చూపిస్తాయి. ప్రస్తుతం డెకాయిట్ తో పాటు గూఢచారి 2 మూవీస్ చేస్తున్నాడు శేష్. గూఢచారి 1 చేసినప్పుడు అతని బడ్జెట్ 5 కోట్ల వరకూ మాత్రమే. కానీ అవుట్ పుట్ చూస్తే మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుంది. నిజానికి శేష్ రేంజ్ మార్చింది.. ఈ మూవీయే.

అందుకు గూఢచారికి సీక్వెల్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్ గానే ఈ సీక్వెల్ స్టార్ట్ అయింది. అయితే ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత అతని గురించి తెలిసింది కాబట్టి ఈ చిత్రానికి ఏకంగా 100 కోట్ల బడ్జెట్ వచ్చిందట. ప్రస్తుతం తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ ప్రొడ్యూసర్స్ కు బడ్జెట్ గురించిన పట్టింపులు లేవు. అందుకే దర్శకుడు అడిగినంత అమౌంట్ సెట్ చేశారట. దీంతో గూఢచారి 2 వంద కోట్ల ప్రాజెక్ట్ గా స్టార్ట్ అయింది. ఫస్ట్ పార్ట్ ను శశికిరణ్ టిక్కా డైరెక్ట్ చేశాడు. ఈ సీక్వెల్ ను మాత్రం వినయ్ కుమార్ సరిగినీడి డైరెక్ట్ చేస్తున్నాడు. రెండు కథలనూ రాసుకుంది అడవి శేషే. ఈ పార్ట్ లో ఇమ్రాన్ హష్మీ, మధుశాలినితో పాటు సుప్రియా యార్లగడ్డ కూడా కనిపించబోతున్నారు. సో.. ఇక ఈ సారి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ మూవీ ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. ఇంకా చెబితే ఓ మిషన్ ఇంపాజిబుల్, జేమ్స్ బాండ్ తరహా కంటెంట్ ను కూడా ఎక్స్ పెక్ట్ చేయొచ్చేమో. మొత్తంగా ఈ రేంజ్ లో బడ్జెట్ పెరిగిన సీక్వెల్ ఈ మధ్య కాలంలో కాంతార తర్వాత గూఢచారి 2 అనే చెప్పాలి. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News