Akkineni Nagarjuna : బ్రేకింగ్ న్యూస్ : రజినీకాంత్ కి విలన్ గా నాగార్జున
రూమర్స్ నిజమయ్యాయి. కెరీర్ లో చాలాసార్లు ప్రత్యేక పాత్రలు చేశాడు నాగార్జున. తన తరం హీరోల్లో అత్యధిక మల్టీస్టారర్లు చేసింది కూడా ఆయనే. అయినా అభిమానులకు ఎప్పుడూ మన్మథుడుగానే కనిపించాడు. చాలాయేళ్ల క్రితం బాలీవుడ్ లో ఓ మూవీలో నెగెటివ్ షేడ్స్ తో కనిపించాడు. మళ్లీ ఇన్నాళ్లకు పూర్తిగా నెగెటివ్ రోల్ చేయబోతున్నాడు. అదీ తమిళ్ మూవీలో కావడం విశేషం. సౌత్ లో చాలా వేగంగా టాప్ డైరెక్టర్ గా మారిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న కూలీ సినిమాలో నాగ్ కూడా ఓ పాత్ర చేస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేస్తూ నాగ్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు నాగార్జున.ఈ లుక్ లో నాగ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తున్నా.. చేతికి ఖరీదైన బంగారు వాచ్ తో దాన్ని సరిచేస్తున్నట్టుగా ఉంది స్టిల్. చూడగానే ఆకట్టుకుంటోంది. నాగ్ ఇలాంటి పాత్రకు ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయ్యే ఉంటుంది. లోకేష్ మూవీలో నటిస్తే ప్రతి పాత్రకూ ఒక గుర్తింపు ఉంటుంది. నాగ్ లాంటి ఇమేజ్ ఉన్న వెటరన్స్ అయితే ఇంక చెప్పేదేముందీ.. అదిరిపోయే పాత్రే అయి ఉంటుందనుకోవాలి. ఏదేమైనా నాగ్ విలన్ గా మారడాన్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ.. ఈ లుక్ అయితే బావుంది.
రూమర్స్ నిజమయ్యాయి. కెరీర్ లో చాలాసార్లు ప్రత్యేక పాత్రలు చేశాడు నాగార్జున. తన తరం హీరోల్లో అత్యధిక మల్టీస్టారర్లు చేసింది కూడా ఆయనే. అయినా అభిమానులకు ఎప్పుడూ మన్మథుడుగానే కనిపించాడు. చాలాయేళ్ల క్రితం బాలీవుడ్ లో ఓ మూవీలో నెగెటివ్ షేడ్స్ తో కనిపించాడు. మళ్లీ ఇన్నాళ్లకు పూర్తిగా నెగెటివ్ రోల్ చేయబోతున్నాడు. అదీ తమిళ్ మూవీలో కావడం విశేషం. సౌత్ లో చాలా వేగంగా టాప్ డైరెక్టర్ గా మారిన లోకేష్ కనకరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న కూలీ సినిమాలో నాగ్ కూడా ఓ పాత్ర చేస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేస్తూ నాగ్ కు బర్త్ డే విషెస్ చెప్పాడు దర్శకుడు నాగ్ అశ్విన్. సైమన్ అనే పాత్రలో కనిపించబోతున్నాడు నాగార్జున.
ఈ లుక్ లో నాగ్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతానికి బ్లాక్ అండ్ వైట్ లోనే కనిపిస్తున్నా.. చేతికి ఖరీదైన బంగారు వాచ్ తో దాన్ని సరిచేస్తున్నట్టుగా ఉంది స్టిల్. చూడగానే ఆకట్టుకుంటోంది. నాగ్ ఇలాంటి పాత్రకు ఒప్పుకున్నాడు అంటే ఖచ్చితంగా సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయ్యే ఉంటుంది. లోకేష్ మూవీలో నటిస్తే ప్రతి పాత్రకూ ఒక గుర్తింపు ఉంటుంది. నాగ్ లాంటి ఇమేజ్ ఉన్న వెటరన్స్ అయితే ఇంక చెప్పేదేముందీ.. అదిరిపోయే పాత్రే అయి ఉంటుందనుకోవాలి. ఏదేమైనా నాగ్ విలన్ గా మారడాన్ని ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో కానీ.. ఈ లుక్ అయితే బావుంది.
What's Your Reaction?