Akkineni Nagarjuna : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జు రియాక్షన్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయడానికి హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైడ్రా ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను కూడా కూల్చివేశారు. గతంలో అక్కడ ఒక చెరువు ఉండేదని.. దాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ కన్వెన్షన్ కు సంబంధించిన కేస్ ప్రస్తుతం కోర్ట్ లో ఉంది. ఆ విషయం తెలిసి కూడా అధికారులు ఫంక్షన్ హాలును ధ్వంసం చేయడం చట్ట విరుద్ధమని, ఈ విషయంపై తాను కోర్ట్ కు వెళతానని చెబుతూ.. అక్కినేని నాగార్జున ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటన సారాంశం ఇది.స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను. ‘‘ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది. స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని. తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం. అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.’’ -అక్కినేని నాగార్జునస్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను…— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 24, 2024

Aug 24, 2024 - 18:22
 0  1
Akkineni Nagarjuna : 
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై నాగార్జు రియాక్షన్

తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలను కూల్చేవేయడానికి హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైడ్రా ఆధ్వర్యంలో అనేక ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ను కూడా కూల్చివేశారు. గతంలో అక్కడ ఒక చెరువు ఉండేదని.. దాన్ని ఆక్రమించి ఈ నిర్మాణం చేపట్టారని అధికారులు చెబుతున్నారు. అయితే ఆ కన్వెన్షన్ కు సంబంధించిన కేస్ ప్రస్తుతం కోర్ట్ లో ఉంది. ఆ విషయం తెలిసి కూడా అధికారులు ఫంక్షన్ హాలును ధ్వంసం చేయడం చట్ట విరుద్ధమని, ఈ విషయంపై తాను కోర్ట్ కు వెళతానని చెబుతూ.. అక్కినేని నాగార్జున ఒక ప్రకటన విడుదల చేశాడు. ఆ ప్రకటన సారాంశం ఇది.

స్టే ఆర్డర్‌లు మరియు కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు సంబంధించి కూల్చివేతలు చేపట్టడం బాధాకరం. మా ప్రతిష్టను కాపాడటం కోసం, కొన్ని వాస్తవాలను తెలియజేయడం కోసం మరియు చట్టాన్ని ఉల్లంఘించేలా మేము ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుపుట కొరకు ఈ ప్రకటనను జారీ చేయడం సరైనదని నేను భావించాను.

‘‘ఆ భూమి పట్టా భూమి. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేయబడింది.

స్పష్టంగా చెప్పాలంటే, కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగింది.

ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు మాకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా, కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే, కూల్చివేత నేనే నిర్వహించి ఉండేవాడిని.

తాజా పరిణామాల వల్ల, మేము ఆక్రమణలు చేశామని, తప్పుడు నిర్మాణాలు చేపట్టామని ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్ళే అవకాశముంది. ఆ అభిప్రాయాన్ని పోగొట్టాలనేదే మా ప్రధాన ఉద్దేశం.

అధికారులు చేసిన ఈ చట్ట విరుద్ధ చర్యలకు వ్యతిరేకంగా మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అక్కడ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను.’’

-అక్కినేని నాగార్జున

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News