Allu Arjun | అసలు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా..? జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి సంచలన వ్యాఖ్యలు
Allu Arjun | టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా..? ఆ సంగతి నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే అని స్పష్టం చేశారు.
Allu Arjun | అమరావతి : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారా..? ఆ సంగతి నాకు తెలియదు. మామూలుగా నాకు తెలిసి ఉన్నదంతా మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి విడిపోయిన వచ్చిన వ్యక్తులు బ్రాంచీలుగాని, షామియానా కంపెనీలు లాగా ఏమైనా పెట్టుకుంటే మాకు తెలియదు. కానీ ఉన్నదే మెగా ఫ్యాన్స్. ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ. అంతే తప్ప అల్లు అర్జున్‌కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఫ్యాన్స్ ఉన్నారని.. ఆయన స్థాయి మరిచి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు.
చిరంజీవి అభిమానులు చిరంజీవిని, పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్‌ను, రామ్‌చరణ్ అభిమానులు రామ్‌చరణ్‌ను చూసుకుంటున్నారు. నేను పెద్ద పుడంగిని నాకు ఇష్టమైతేనే వస్తా అంటే మానేసి వెళ్లిపో. ఎవడికి కావాలి..? నిన్నేమైనా రమ్మని అడిగామా..? నువ్వు వస్తే ఏంటి..? రాకపోతే ఏంటి..? 21 చోట్ల నిలబడితే 21 నెగ్గాం మేము. నువ్వు వెళ్లిన ఒక్క సీటు కూడా ఓడిపోయింది. మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గించలేదు.. అందర్నీ విమర్శించడం సరికాదు అని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అల్లు అర్జున్‌కు అసలు ఫ్యాన్స్ ఉన్నారా?
జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
నాకు ఫ్యాన్స్ ఉన్నారని ఆయన ఊహించుకుంటున్నారేమో..?
ఆయనకి ఉన్నది మెగా ఫ్యాన్స్ మాత్రమే
అల్లు అర్జున్ స్థాయి మరచి మాట్లాడుతున్నాడు. నువ్వు వస్తే ఏంటి… రాకపోతే ఏంటి.
21 స్థానాల్లో… pic.twitter.com/7kAHbfzio0
— Telugu Scribe (@TeluguScribe) August 27, 2024
What's Your Reaction?