Allu Arjun & Mega Family : మెగా ఫ్యామిలీ పై అల్లు అర్జున్ వార్ డిక్లేర్

సినిమా వరకూ వస్తే ఫ్యామిలీ వేరు, పోటీ వేరు. అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నా కూడా ప్రొఫెషనల్ గా పోటీ పడవచ్చు.. ఎవరి సత్తా మేరకు వాళ్లు స్టార్డమ్ తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి వస్తేఅంతా ఒకటే కుటుంబంగా కలిసి పోవచ్చు. బట్ రెండు చోట్లా పోటీ ఉంటే కుటుంబం అనే మాటకు అర్థం ఉండదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆ సిట్యుయేషన్లోనే ఉన్నాడు. కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో దూరం పాటిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో. సరే మిగతా వాళ్లైనా కలిసి ఉన్నారు కదా అనుకుంటే అదీ లేదు అంటూ ఆ మధ్య ఏపీ ఎలెక్షన్ టైమ్ లో పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకుండా అతని అపోనెంట్ పార్టీ అయినా వైసీపీకి చెందిన శిల్పారెడ్డికి పిలవకున్నా వెళ్లి ప్రచారం చేశాడు. అప్పుడే మెగా ఫ్యామిలీ భగ్గుమంది. నాగబాబు డైరెక్ట్ గానే అటాక్ మొదలుపెట్టాడు. అటు ఫ్యాన్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. ఓ దశలో అల్లు అర్జున్ కెరీర్ ను స్మాష్ చేస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. దీంతో భయపడ్డారు. ఆగస్ట్ 15న రావాల్సిన పుష్ప 2ను పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే అప్పటికి కాస్త వేడి తగ్గుతుంది. ఈ సినిమాకు ఇబ్బంది ఉండదు అనుకున్నారు. బట్ దీనికి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అందుకే వాయిదా వేశం అనే కలరింగ్స్ యాడ్ చేశారు అది వేరే విషయం.ఎలా చూసినా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కాదు.. ఫ్యామిలీ నుంచే అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఒక్క చిరంజీవి తప్పఅంతా కమెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా బెంగళూరు వెళ్లినప్పుడు ఈ మధ్య అడవులను నరికే వాళ్లు హీరోలవుతున్నారు అంటూ ఇన్ డైరెక్ట్ గా పుష్ప మూవీపై సెటైర్ వేశాడు. తద్వారా ఆ మూవీకి అక్కడ డ్యామేజ్ జరిగిందనేది నిజం. ఇలాంటి సందర్భాల్లో కాస్త తెలివిగా వ్యవహరించాలి. జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసేలా కాస్త హుందాగా ప్రవర్తించాలి. అందుకోసం వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. కానీ అల్లు అర్జున్ అలా కాదు.. తను నిజంగానే ఒక ఆర్మీకి చీఫ్ కమాండర్ ను అనుకుంటున్నాడేమో.. ఆ రేంజ్ లో మళ్లీ మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ను, ఆ ఫ్యాన్స్ ను ఇన్ డైరెక్ట్ గా ఉటంకిస్తూ.. మరోసారి కెలుక్కున్నాడు. తాజాగా అల్లు అర్జున్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యాడు. ఇది సుకుమార్ భార్య ప్రెజెంట్ చేసిన సినిమా. అందుకే తను చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఇక్కడే మరోసారి అందరినీ కెలికాడు. సరే అది అతని ఆత్మవిశ్వాసం అనుకున్నా.. ఈ సందర్భంగా అతను మాట్లాడిన మాటలు కూడా ట్రోల్ అవుతున్నాయి. ఆ ఆణిముత్యాలను ఒకసారి చూద్దాం. 'ఎవరైనా హీరోలను చూసి ఫ్యాన్స్ వస్తారు. కానీ నేను ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యా".. ఇది అందులో ఒకటి. నిజానికి ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యాను అనే మాటేంటీ.. హీరోలు కాకుండా ఫ్యాన్స్ ఎలా వస్తారు బాబూ.. ఈ మాటలో ఎంత పిచ్చితనం ఉందో అర్థం కావడం లేదా అంటూ సెటైర్స్.. ట్రోల్స్ పడుతున్నాయి. అంతే కాదు.. మొన్నటి వరకూ చిరంజీవిని చూసి హీరో అయ్యాను అని చెప్పేవాడు.. ఇప్పుడిలా అంటున్నాడు అని ఫ్యాన్స్ కూడా రివర్స్ అవుతున్నారు. ఇక అసలైన పాయింట్.. అసలు ఇక్కడ అవసరం లేని పాయింట్ ఒకటి మాట్లాడాడు. తను ఈ ఫంక్షన్ కు సుకుమార్ తో పాటు అతని వైఫ్ కోసం వచ్చాను అంటే సరిపోయేది.. ఊహూ.. అలా అంటే అతను అల్లు వారి హీరో ఎలా అవుతాడు. ఏమన్నాడో చూడండి. " యూ నో.. మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్లు అనుకో కావాల్సినోళ్లు అనుకో.. నాకిష్టమైతే నేనొస్తా.. నా మనసుకు నచ్చితే నేనొస్తా.. అది మీ అందరికీ తెలిసిందే.. ".. ఇదీ అల్లు అర్జున్ డైలాగ్. అంటే అతనికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు. అతని మనసుకు నచ్చిన వ్యక్తి కాదు.. అంతే కదా అర్థం. ఇన్ డైరెక్ట్ గా అంటేనే ఇవాళా రేపు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇంక డైరెక్ట్ గా అంటే ఊరుకుంటారా.. అందుకే మెగా ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ ఏం చేసినా అది దేశ క్షేమం కోసం అని భావించి ప్రతిసారీ వెకనకేసువచ్చే ఫ్యాన్స్.. సారీ ఆర్మీ.. ఈసారి ఖచ్చితంగా డిఫెన్స్ లో పడ్డారు. ఇతనేంటీ ఇలా అంటున్నాడు. త్వరలో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు మళ్లీ కెలుక్కోవడం అవసరమా.. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలా అని తలలు పట్టుకుంటున్నారట. సో.. ఈ వేదిక సాక్షిగా అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీపై వార్ డిక్లేర్ చేశాడనే అనుకోవాలా.. దీని తర్వాతి పరిణామాలకు సిద్ధమయ్యే ఇలాంటి ప్రకటన చేశాడా లేక.. తెలిసీ తెలియక అనేశాడా అనేది అతి త్వరలోనే డిసెంబర్ లో తేలిపోతుంది.

Aug 23, 2024 - 11:17
 0  1
Allu Arjun & Mega Family : 
మెగా ఫ్యామిలీ పై అల్లు అర్జున్ వార్ డిక్లేర్

సినిమా వరకూ వస్తే ఫ్యామిలీ వేరు, పోటీ వేరు. అంటే ఒకే ఫ్యామిలీలో ఉన్నా కూడా ప్రొఫెషనల్ గా పోటీ పడవచ్చు.. ఎవరి సత్తా మేరకు వాళ్లు స్టార్డమ్ తెచ్చుకోవచ్చు. ఆ తర్వాత ఇంటికి వస్తేఅంతా ఒకటే కుటుంబంగా కలిసి పోవచ్చు. బట్ రెండు చోట్లా పోటీ ఉంటే కుటుంబం అనే మాటకు అర్థం ఉండదు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఆ సిట్యుయేషన్లోనే ఉన్నాడు. కొన్నాళ్లుగా మెగా ఫ్యామిలీతో దూరం పాటిస్తున్నాడు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో. సరే మిగతా వాళ్లైనా కలిసి ఉన్నారు కదా అనుకుంటే అదీ లేదు అంటూ ఆ మధ్య ఏపీ ఎలెక్షన్ టైమ్ లో పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకుండా అతని అపోనెంట్ పార్టీ అయినా వైసీపీకి చెందిన శిల్పారెడ్డికి పిలవకున్నా వెళ్లి ప్రచారం చేశాడు. అప్పుడే మెగా ఫ్యామిలీ భగ్గుమంది. నాగబాబు డైరెక్ట్ గానే అటాక్ మొదలుపెట్టాడు. అటు ఫ్యాన్స్ మధ్య విభేదాలు తారాస్థాయికి వెళ్లాయి. ఓ దశలో అల్లు అర్జున్ కెరీర్ ను స్మాష్ చేస్తారు అనే ప్రచారం కూడా జరిగింది. దీంతో భయపడ్డారు. ఆగస్ట్ 15న రావాల్సిన పుష్ప 2ను పోస్ట్ పోన్ చేశారు. ఎందుకంటే అప్పటికి కాస్త వేడి తగ్గుతుంది. ఈ సినిమాకు ఇబ్బంది ఉండదు అనుకున్నారు. బట్ దీనికి ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. అందుకే వాయిదా వేశం అనే కలరింగ్స్ యాడ్ చేశారు అది వేరే విషయం.

ఎలా చూసినా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కాదు.. ఫ్యామిలీ నుంచే అల్లు అర్జున్ పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఒక్క చిరంజీవి తప్పఅంతా కమెంట్స్ చేశారు. పవన్ కళ్యాణ్ రీసెంట్ గా బెంగళూరు వెళ్లినప్పుడు ఈ మధ్య అడవులను నరికే వాళ్లు హీరోలవుతున్నారు అంటూ ఇన్ డైరెక్ట్ గా పుష్ప మూవీపై సెటైర్ వేశాడు. తద్వారా ఆ మూవీకి అక్కడ డ్యామేజ్ జరిగిందనేది నిజం. ఇలాంటి సందర్భాల్లో కాస్త తెలివిగా వ్యవహరించాలి. జరిగిన డ్యామేజ్ ను కంట్రోల్ చేసేలా కాస్త హుందాగా ప్రవర్తించాలి. అందుకోసం వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. కానీ అల్లు అర్జున్ అలా కాదు.. తను నిజంగానే ఒక ఆర్మీకి చీఫ్ కమాండర్ ను అనుకుంటున్నాడేమో.. ఆ రేంజ్ లో మళ్లీ మెగా ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ను, ఆ ఫ్యాన్స్ ను ఇన్ డైరెక్ట్ గా ఉటంకిస్తూ.. మరోసారి కెలుక్కున్నాడు. తాజాగా అల్లు అర్జున్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు అటెండ్ అయ్యాడు. ఇది సుకుమార్ భార్య ప్రెజెంట్ చేసిన సినిమా. అందుకే తను చీఫ్ గెస్ట్ గా వచ్చాడు. ఇక్కడే మరోసారి అందరినీ కెలికాడు.

సరే అది అతని ఆత్మవిశ్వాసం అనుకున్నా.. ఈ సందర్భంగా అతను మాట్లాడిన మాటలు కూడా ట్రోల్ అవుతున్నాయి. ఆ ఆణిముత్యాలను ఒకసారి చూద్దాం.

'ఎవరైనా హీరోలను చూసి ఫ్యాన్స్ వస్తారు. కానీ నేను ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యా".. ఇది అందులో ఒకటి. నిజానికి ఫ్యాన్స్ ను చూసి హీరో అయ్యాను అనే మాటేంటీ.. హీరోలు కాకుండా ఫ్యాన్స్ ఎలా వస్తారు బాబూ.. ఈ మాటలో ఎంత పిచ్చితనం ఉందో అర్థం కావడం లేదా అంటూ సెటైర్స్.. ట్రోల్స్ పడుతున్నాయి. అంతే కాదు.. మొన్నటి వరకూ చిరంజీవిని చూసి హీరో అయ్యాను అని చెప్పేవాడు.. ఇప్పుడిలా అంటున్నాడు అని ఫ్యాన్స్ కూడా రివర్స్ అవుతున్నారు.

ఇక అసలైన పాయింట్.. అసలు ఇక్కడ అవసరం లేని పాయింట్ ఒకటి మాట్లాడాడు. తను ఈ ఫంక్షన్ కు సుకుమార్ తో పాటు అతని వైఫ్ కోసం వచ్చాను అంటే సరిపోయేది.. ఊహూ.. అలా అంటే అతను అల్లు వారి హీరో ఎలా అవుతాడు. ఏమన్నాడో చూడండి.

" యూ నో.. మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్లు అనుకో కావాల్సినోళ్లు అనుకో.. నాకిష్టమైతే నేనొస్తా.. నా మనసుకు నచ్చితే నేనొస్తా.. అది మీ అందరికీ తెలిసిందే.. ".. ఇదీ అల్లు అర్జున్ డైలాగ్.

అంటే అతనికి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేదు. అతని మనసుకు నచ్చిన వ్యక్తి కాదు.. అంతే కదా అర్థం. ఇన్ డైరెక్ట్ గా అంటేనే ఇవాళా రేపు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇంక డైరెక్ట్ గా అంటే ఊరుకుంటారా.. అందుకే మెగా ఫ్యాన్స్ ఏకి పారేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ ఏం చేసినా అది దేశ క్షేమం కోసం అని భావించి ప్రతిసారీ వెకనకేసువచ్చే ఫ్యాన్స్.. సారీ ఆర్మీ.. ఈసారి ఖచ్చితంగా డిఫెన్స్ లో పడ్డారు. ఇతనేంటీ ఇలా అంటున్నాడు. త్వరలో సినిమా రిలీజ్ పెట్టుకుని ఇప్పుడు మళ్లీ కెలుక్కోవడం అవసరమా.. ఇప్పుడు దీన్ని ఎలా కవర్ చేయాలా అని తలలు పట్టుకుంటున్నారట. సో.. ఈ వేదిక సాక్షిగా అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీపై వార్ డిక్లేర్ చేశాడనే అనుకోవాలా.. దీని తర్వాతి పరిణామాలకు సిద్ధమయ్యే ఇలాంటి ప్రకటన చేశాడా లేక.. తెలిసీ తెలియక అనేశాడా అనేది అతి త్వరలోనే డిసెంబర్ లో తేలిపోతుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News