బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మరో వారం రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. మరో వారం రోజులు వర్షాలు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం. మరో వారం రోజులు వర్షా లు కురుస్తాయన్న వాతావరణ శాఖ వర్షాకాలం సీజన్ ముగిసిన తర్వాత ఆంధ్రప్ర దేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఫెంగల్ తుఫాను తీవ్రతతో కోస్తాంధ్ర, రాయల సీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ గండం నుంచి రైతులు, ప్రజలు గట్టెక్కక ముందే మరో అల్పపీదనం రాష్ట్రాన్ని వెంటాడుతోంది. ఈనెల 9వతేది నుంచి 16వ తేది మధ్యలో బంగాళాఖా తంలోమరో అల్పపీడనం ఏర్చ దే అవకాశముంద నిఐఎండీ హెచ్చరించింది.
దీనికారణంగా దక్షిణ కోస్తా జిల్లాలపై అధిక ప్రభావం చూపించనుంద ని. ఆయా జిల్లాల్లో మరికొన్ని రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణకేంద్రం మరో పిడుగులాంటి వార్త చెప్పింది. డిసెంబర్ 9వ తేది నుంచి 16వ తేదిలోకా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఛాన్సుందని తెలిపింది. ఇప్పటికే ఫెంగల్ తుఫానుధాటికి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను తీరం దాటిన ప్పటికి వర్షాలు తగ్గడం లేదు. వర్షాలు మిగిల్చిన కష్టాల్లో ఉన్న ఏపీ ప్రజలకు మరో అల్పపీడనం వల్ల మరో వారం రోజులు వర్షాలు కురుస్తాయనే కబురుతో అయోమయంలో పడ్డారు.
ఈనెల రెందో వారంలో ఏర్పడే అల్బపీదనం బలహీన పడి తుఫానుగా మారితే దాని ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలోతీవంగా ఉంటుంది. ఇప్పటి కే ఫెంగల్ తుఫాను తీరం దాటినప్పటికి మంగళ వారం కూడా కోస్తాంధ్ర, రాయలసీ జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. పలు జిల్లాల్లో వేలాది ఎకరాల పంట పొలాలు నీటమునిగాయి. చాలా ప్రాంతా ల్లో రోడ్డు, రహదారులపై వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మరో అల్పపీడనం ముప్పు ముంచుకొస్తే పరిస్థితి ఏంటని రైతులు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
What's Your Reaction?