రైతుల కోసం పాడి పరిశ్రమను ప్రోత్సహించే దిశగా మరో సరికొత్త పథకం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
రైతుల కోసం పాడి పరిశ్రమను ప్రోత్సహించే దిశగా మరో సరికొత్త పథకం: డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి
మన మంచి ప్రభుత్వంలో మరో మంచి కార్యక్రమం రైతుల కోసం పాడి పరిశ్రమను ప్రోత్సహించే దిశగా మరో సరికొత్త పథకం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి రైతుల సంక్షేమం ద్యేయంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద నేడు గోకుల్ షెడ్యూల్ ప్రారంభించడం ఒక శుభ పరిణామమని డాక్టర్ లక్ష్మి అభిప్రాయపడ్డారు. దర్శి మండలం బసిరెడ్డి పల్లెలో శుక్రవారం మన దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గోకుల్ షెడ్ ను ప్రారంభించారు. డా|| లక్ష్మీ తో పాటు టిడిపి యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య గారు, MGNREGA అధికారులు తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.... పాడి పరిశ్రమను అభివృద్ధి పరిచేందుకు రైతుల సంక్షేమం కోసం ఉపాధి హామీ కింద ఆరు గేదెలకు, నాలుగు గేదెలకు అవసరమైన షెడ్ ల నిర్మాణానికి 90 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం రైతులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అదేవిధంగా చేతివృత్తుల వారైనా గొర్రెలు, మేకల, కోళ్ల పెంపకం దారులకు కూడా ఈ షెడ్ లను కేటాయించడం జరిగిందన్నారు. మన దర్శి నియోజకవర్గంలో దాదాపు 150 షెడ్ లను మంజూరు చేయడం జరిగిందని ఆమె వివరించారు. ఒక్కో గోకులం షెడ్డు కు లక్షన్నర నుండి 230000 వరకు ఈ పథకం కింద రైతులు అందజేయడం జరుగుతుంది అని తెలిపారు.
ప్రియతమ ముఖ్య మంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు నిరంతరం అభివృద్ధి సంక్షేమం ప్రజల అవసరాలు తీర్చే లక్ష్యంగా మన ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో నేడు రైతుల సంక్షేమం కోసం ఈ పథకాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. గత ప్రభుత్వంలో విధ్వంసం, వినాశనం, ఆర్థిక దుర్వినియోగం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా రైతుల సంక్షేమం కోసం మన ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఈ పథకం యొక్క అమలును బట్టి అర్థం చేసుకోవచ్చు. గ్రామీణ పల్లెల్లో ముఖ్యంగా మహిళలు పాడి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందుతున్నారు. మన దర్శి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో పాడి పరిశ్రమ ద్వారానే ఎక్కువ కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి.
మన కుటుంబాలకు ఈ గోకులం షెడ్ లు ఎంతో మేలు చేస్తాయని వీటిని సక్రమంగా వినియోగించుకోవాలని డాక్టర్ లక్ష్మి వివరించారు. మంచి పనులు చేసే మంచి ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరించాలని అభిమానించాలని, ఆశీర్వదించాలని ఆమె కోరారు. ఇక గ్రామాలలో కుల ఘర్షణలు, వర్గ వైశమ్యాలు విడనాడి మన మంచి అభివృద్ధి సంక్షేమ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని డాక్టర్ లక్ష్మీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో దర్శి మండలం మరియు బసిరెడ్డి పల్లి గ్రామం లోని వివిద హోదాల్లో ఉన్న నాయకులు, మహిళలు, టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
What's Your Reaction?