AP E Cabinet | రేపు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. నోట్స్ లేకుండా ఈ-ట్యాబ్‌లతో నిర్వహణ
AP E Cabinet | ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం బుధవారం జరుగనుంది. సచివాలయంలోని సీఎం చాంబర్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం(AP cabinet ) బుధవారం జరుగనుంది. సచివాలయంలోని సీఎం చాంబర్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నది. సీఎం చంద్రబాబు (Chandra Babu) అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపనుంది . ఈసారి మంత్రి వర్గ సమావేశం పేపర్‌లెస్‌తో జరుగనుండడం విశేషం. గతంలో సమావేశానికి వచ్చే మంత్రులకు నోట్ అందజేసి నిర్వహించేవారు.
దానికి భిన్నంగా రేపు జరుగనున్న సమావేశంలో అజెండా మొదలుకుని నోట్స్ వరకు ఈ-ట్యాబ్(Tabs)లు మంత్రులకు అందజేయనున్నారు. ఇప్పటికే ట్యాబ్‌ల వాడకంపై సచివాలయ అధికారులు మంత్రులకు, వ్యక్తిగత కార్యదర్శులకు శిక్షణ ఇచ్చింది. 2014-19 వరకు టీడీపీ హయాంలోనూ ఈ కేబినెట్ ద్వారా సమావేశాలను నిర్వహించిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత వాటిన మూలాన పడేసి సమావేశాలను నిర్వహించింది.
What's Your Reaction?