AP News | వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డి అరెస్టు
AP News | వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వేకోడూరులోని లక్ష్మీ థియేటర్‌కు సంబంధించిన స్థల వివాదంలో గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
AP News | వైసీపీ నేత కొల్లం గంగిరెడ్డిని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రైల్వేకోడూరులోని లక్ష్మీ థియేటర్‌కు సంబంధించిన స్థల వివాదంలో గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
ఆదివారం సాయంత్రం థియేటర్ వద్ద గొడవ జరిగింది. దీనిపై థియేటర్ యజమానులు పోలీసులకు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన రైల్వేకోడూరు పోలీసులు సోమవారం సాయంత్రం దాదాపు గంట పాటు గంగిరెడ్డిని విచారించారు. అనంతరం ఆయన్ను విడిచిపెట్టారు. కానీ ఎస్పీ విద్యాసాగర్‌కు సమాచారం ఇవ్వడంతో గంగిరెడ్డిని వెంటనే తన వద్దకు తీసుకురావాలని ఆదేశించారు. దీంతో మళ్లీ గంగిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ విద్యాసాగర్ ప్రస్తుతం మదనపల్లెలో ఉండటంతో గంగిరెడ్డిని అక్కడికే తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలానికి చెందిన గంగిరెడ్డి అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌గా పేరొందారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పలు ఎర్రచందనం కేసుల్లో గంగిరెడ్డిని అరెస్టు చేశారు. కానీ వైసీపీ హయాంలో అతను జైలు నుంచి విడుదలయ్యారు. ఆ తర్వాత వైసీపీలో చేరి అనేక సెటిల్‌మెంట్లు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
What's Your Reaction?