AP News | గొప్ప మనసు చాటుకున్న జనసేన ఎమ్మెల్యే.. పసికందు గుండె ఆపరేషన్‌కు చేయూత
AP News | జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి గొప్ప మనసు చాటుకున్నారు. గుండె సంబంధిత సమస్యలతో పుట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి ఆపన్నహస్తం అందించారు. రూ.10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేయించి ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు.
AP News | జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గొప్ప మనసు చాటుకున్నారు. గుండె సంబంధిత సమస్యలతో పుట్టి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ చిన్నారికి ఆపన్నహస్తం అందించారు. రూ.10 లక్షలు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేయించి ఆ చిన్నారి ప్రాణాన్ని కాపాడాడు.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నిడమర్రు మండలం పెద్దినిండ్రకొలను గ్రామానికి చెందిన బొంగా సురేశ్- జ్యోత్స్న దంపతులకు ఇటీవల ఓ బిడ్డ జన్మించింది. కానీ ఆ చిన్నారి కొద్దిరోజుల్లోనే అనారోగ్యానికి గురైంది. దీంతో పరీక్షలు జరిపిన వైద్యులు.. శిశువు పుట్టుకతో గుండెలో రంధ్రంతో జన్మించిందని గుర్తించారు. తక్షణమే ఆపరేషన్ చేయాలని.. లేకుంటే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. వైద్యానికి రూ.7 లక్షల నుంచి 10 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు. కానీ ఆ తల్లిదండ్రులకు అంత ఆర్థిక స్తోమత లేదు. దీంతో వైద్యానికి డబ్బులు ఎలా తీసుకురావాలో తెలియక దిక్కుతోచని పరిస్థితులో ఉండగా.. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టిని ఆశ్రయించారు.
చిన్నారి కష్టం విని చలించిపోయిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తాను ఉన్నాననే భరోసా ఇచ్చారు. వెంటనే ఆ పసికందును తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ( సిమ్స్) వైద్యులను సంప్రదించారు. వారితో మాట్లాడి 10 లక్షల వ్యయం కాగల ఆపరేషన్‌ను ఉచితంగా చేయించి బిడ్డను కాపాడారు.
What's Your Reaction?