AP Politics: టాప్-5లో చంద్రబాబు
ఇండియా టుడే - సీ ఓటర్ సర్వే
ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలో అత్యంత జనాదరణ కలిగిన టాప్-5 సీఎంల జాబితాలో నిలిచారు. ‘ఇండియా టుడే- సీ ఓటర్’ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ పేరుతో అనేక అంశాలపై దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలను గురువారం ‘ఇండియా టుడే’ వెల్లడించింది. ఇందులో... అత్యధిక జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులకు సంబంధించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ సీఎం చంద్రబాబు ఇద్దరూ నాలుగో స్థానంలో నిలిచారు.
ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ నిలిచారు. తర్వాతి స్థానాల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో... స్టాలిన్, చంద్రబాబు నిలిచారు. ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన రెండు నెలల్లోనే చంద్రబాబు టాప్-5 ముఖ్యమంత్రుల జాబితాలోకి రావడం విశేషం. ‘‘అభివృద్ధి రాజకీయాలకు దేశంలో చంద్రబాబు చిరునామాగా ఉన్నారు. గతంలో హైదరాబాద్‌ను బాగా అభివృద్ధి చేసిన రికార్డు ఆయన సొంతం’’ అని దీనిపై జరిగిన చర్చలో పాల్గొన్న వక్తలు పేర్కొన్నారు.
What's Your Reaction?