AP : లంక సముద్ర తీరానికి కొట్టుకు వచ్చిన సొరచేప లాంటి చేప
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం పీఎం లంక సముద్ర తీరానికి సొర చేపను పోలి ఉన్న చేప కొట్టుకు వచ్చింది. దాదాపు నాలుగు అడుగుల పొడవుతో.. చూడడానికి సొర చేపలానే ఉంది. దాంతో దానిని సొరచేప అని అక్కడున్న మత్స్యకారులు అనుకున్నారు. రెండు రోజులుగా సముద్రం పోటు ఎక్కువగా ఉండటంతో అలల ఉధృతి పెరిగింది. దీంతో భారీగా చేపలు అలల ఉధృతికి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. ఆ క్రమంలోనే సొరచేపను పోలిన చేప సైతం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. కాసేపటి తర్వాత మత్స్యకారులు ఆ చేపను తిరిగే మళ్ళీ సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలివేశారు. అయితే అది సొరచేప కాదని తిమింగలం జాతికి చెందిన క్షీరదమని ఫిషరీస్‌కు చెందిన ఏమిరిటస్ ప్రొఫెసర్ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఆ జాతి అంతరించిపోయే జాబితాలో ఉందని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం పీఎం లంక సముద్ర తీరానికి సొర చేపను పోలి ఉన్న చేప కొట్టుకు వచ్చింది. దాదాపు నాలుగు అడుగుల పొడవుతో.. చూడడానికి సొర చేపలానే ఉంది. దాంతో దానిని సొరచేప అని అక్కడున్న మత్స్యకారులు అనుకున్నారు.
రెండు రోజులుగా సముద్రం పోటు ఎక్కువగా ఉండటంతో అలల ఉధృతి పెరిగింది. దీంతో భారీగా చేపలు అలల ఉధృతికి ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి. ఆ క్రమంలోనే సొరచేపను పోలిన చేప సైతం ఒడ్డుకు కొట్టుకుని వచ్చింది. కాసేపటి తర్వాత మత్స్యకారులు ఆ చేపను తిరిగే మళ్ళీ సముద్రంలోకి తీసుకువెళ్లి వదిలివేశారు.
అయితే అది సొరచేప కాదని తిమింగలం జాతికి చెందిన క్షీరదమని ఫిషరీస్‌కు చెందిన ఏమిరిటస్ ప్రొఫెసర్ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా ఆ జాతి అంతరించిపోయే జాబితాలో ఉందని వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
What's Your Reaction?