AP : నేడు ఏపీలో 13వేల పంచాయతీల్లో గ్రామసభలు
నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు మొదలుకానున్నాయి. ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన వీటిని నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు.11.40 గంటలకు కొత్తపేట మండలం వానపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసి హెలీప్యాడ్‌కు చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్ చేరుకుంటుంది. 11.45 వరకు ప్రజాప్రతినిధిలు, అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వానపల్లి చేరుకుంటారు. 11.50కు వానపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు రోడ్డు మార్గంలో పల్లాలమ్మ టెంపుల్ మీదుగా చేరుకుంటారు. 11.50 నుంచి 1.30 వరకు స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో చంద్రబాబు పాల్గొంటారు. అదేవిధంగా గ్రామస్తులతో ఇంట్రాక్ట్ అవుతారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల మధ్య భోజన విరామం, ఆ తరువాత స్థానిక నాయకులతో ఇంట్రాక్షన్ ఉంటుంది. మధ్యాహ్నం 2.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వానపల్లి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి 2.20 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు. 2.45 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్‌లో బేగంపేట విమానశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా జూబ్లిహిల్స్‌లోని నివాసానికి చేరుకుంటారు. గ్రామసభల్లో చర్చించే నాలుగు అంశాలేంటంటే..అంశం-1: మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లుఅంశం-2: మురుగునీరు-ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారులుఅంశం-3: గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్లుఅంశం-4: ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం. ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం
నేడు రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు మొదలుకానున్నాయి. ‘స్వర్ణ గ్రామపంచాయతీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల సర్పంచుల అధ్యక్షతన వీటిని నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామసభలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.
ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి చంద్రబాబు హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు.11.40 గంటలకు కొత్తపేట మండలం వానపల్లి పంచాయతీ పరిధిలో ఏర్పాటుచేసి హెలీప్యాడ్‌కు చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలీక్యాప్టర్ చేరుకుంటుంది. 11.45 వరకు ప్రజాప్రతినిధిలు, అధికారులు సీఎంకు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వానపల్లి చేరుకుంటారు. 11.50కు వానపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు రోడ్డు మార్గంలో పల్లాలమ్మ టెంపుల్ మీదుగా చేరుకుంటారు. 11.50 నుంచి 1.30 వరకు స్వర్ణ గ్రామ పంచాయతీ గ్రామ సభలో చంద్రబాబు పాల్గొంటారు.
అదేవిధంగా గ్రామస్తులతో ఇంట్రాక్ట్ అవుతారు. మధ్యాహ్నం 1.30 నుంచి 2.00 గంటల మధ్య భోజన విరామం, ఆ తరువాత స్థానిక నాయకులతో ఇంట్రాక్షన్ ఉంటుంది. మధ్యాహ్నం 2.10 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వానపల్లి హెలీప్యాడ్ వద్దకు చేరుకుని, అక్కడి నుంచి 2.20 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌కు హెలీక్యాప్టర్‌లో బయలుదేరుతారు. 2.45 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్లైట్‌లో బేగంపేట విమానశ్రయం చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా జూబ్లిహిల్స్‌లోని నివాసానికి చేరుకుంటారు.
గ్రామసభల్లో చర్చించే నాలుగు అంశాలేంటంటే..
అంశం-1: మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లు
అంశం-2: మురుగునీరు-ఘన వ్యర్థాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంటు రహదారులు
అంశం-3: గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్లు
అంశం-4: ఇంకుడు గుంతలు, పంటకుంటల నిర్మాణం. ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, షెడ్ల నిర్మాణానికి సహకారం
What's Your Reaction?