AP : మచిలీపట్నం.. మరో బృందావనం.. ఏపీ మంత్రి ఆసక్తికర ప్రకటన

మచిలీపట్నం పట్టణాన్ని బృందావనంగా తీర్చిదిద్దితామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వాసుదేవ గోశాల- గోవంశ సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మచిలీపట్నం అంటేనే ఒక బృందావనమని రానున్న రోజుల్లో పోర్టు నిర్మాణం, పరిశ్రమల స్థాపన ద్వారా మరింత అభివృద్ధి చెందనుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గోపిక, శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో కలిసి సందడి చేశారు. ఆ తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మంత్రి స్వయంగా ఉట్టి కొట్టి అలరించారు.

Aug 27, 2024 - 17:58
 0  1
AP : మచిలీపట్నం.. మరో బృందావనం.. ఏపీ మంత్రి ఆసక్తికర ప్రకటన

మచిలీపట్నం పట్టణాన్ని బృందావనంగా తీర్చిదిద్దితామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. వాసుదేవ గోశాల- గోవంశ సంరక్షణ సంఘం ఆధ్వర్యంలో రాత్రి నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మచిలీపట్నం అంటేనే ఒక బృందావనమని రానున్న రోజుల్లో పోర్టు నిర్మాణం, పరిశ్రమల స్థాపన ద్వారా మరింత అభివృద్ధి చెందనుందన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం గోపిక, శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న చిన్నారులతో కలిసి సందడి చేశారు. ఆ తర్వాత ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. మంత్రి స్వయంగా ఉట్టి కొట్టి అలరించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News