Apple : 2025లోగా 6 లక్షల ఉద్యోగాలు : యాపిల్
ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. వచ్చే ఏడాది నాటికి పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టే అవకాశం ఉందని మార్కెట్ ఎక్స్ పర్ట్స్ అంచనా వేస్తున్నారు. 2025 మార్చి నాటికి ఏకంగా 6లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని భావిస్తున్నారు.దేశంలో ఉపాధి అవకాశాలు పెంచేందుకు యాపిల్ చేపడుతున్న కార్యకలాపాలపై ప్రభుత్వానికి ఓ నివేదిక అందించింది. వ్యాపార విస్తరణలో భాగంలో దేశంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని అందులో వివరించింది. యాపిల్ సంస్థ చైనా ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించాలని భావిస్తోంది. దీంతో దేశీయంగా తన వ్యాపారాన్ని విస్తృతం చేస్తోంది. దీంతో ఏడాది మార్చి నాటికి ప్రత్యక్షంగా 2 లక్షల మందికి ఉపాధి పొందనున్నారు. వీరిలో 70శాతం మంది మహిళలే ఉండొచ్చు. యాపిల్ కాంట్రాక్ట్ తయారీ దారులైన ఫాక్స్‌కాన్, విస్ట్రాన్, పెగట్రాన్ ద్వారా ఇప్పటికే 80,872 మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు.

What's Your Reaction?