Apple CFO | యాపిల్ నూతన సీఎఫ్‌ఓగా కెవన్ పరేఖ్
Apple CFO : యాపిల్ నూతన సీఎఫ్‌ఓగా భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌కు పదోన్నతి కల్పించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు.
Apple CFO : యాపిల్ నూతన సీఎఫ్‌ఓగా భారత సంతతికి చెందిన కెవన్ పరేఖ్‌కు పదోన్నతి కల్పించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి కెవన్ పరేఖ్ నూతన బాధ్యతలు చేపడతారు. 2014 నుంచి యాపిల్ సీఎఫ్‌ఓగా పనిచేస్తున్న లూకా మేస్త్రి స్ధానంలో కెవన్ నియమితులయ్యారు. యాపిల్‌లో 11 ఏండ్ల ప్రస్ధానంలో కెవన్ పలు హోదాల్లో పనిచేశారు.
ప్రస్తుతం ఆయన కంపెనీ ఫైనాన్షియల్ ప్లానింగ్, ఎనాలిసిస్ వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణ, పాలనా వ్యవహారాలతో పాటు, ఇన్వెస్టర్ సంబంధాలు, మార్కెట్ రీసెర్చ్ వంటి పలు విభాగాలను కెవన్ పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు కెవిన్ పరేఖ్ గ్లోబల్ సేల్స్, రిటైల్, మార్కెటింగ్ ఫైనాన్స్ విభాగాలకు నేతృత్వం వహించారు.
ఇక యాపిల్‌లో ఆయన తొలినాళ్లలో ప్రోడక్ట్ మార్కెటింగ్, ఇంటర్నెట్ సేల్స్, సర్వీస్, ఇంజనీరింగ్ టీమ్స్‌లో పనిచేశారు. యాపిల్‌లో చేరకముందు కెవన్ పరేఖ్ థామ్సన్ రాయ్‌టర్స్, జనరల్ మోటార్స్ వంటి పలు కంపెనీల్లో నాయకత్వ స్ధానాల్లో పనిచేస్తూ ప్రపంచవ్యాప్త అనుభవం గడించారు. మిచిగాన్ వర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ఆయన యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి ఎంబీఏ చేశారు.
What's Your Reaction?