APPSC : ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ వాయిదా
ఏపీలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 2 నుంచి 9 వరకు జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు వాయిదా చేసినట్టు ఏపీపీఎస్సీ వెల్లడించింది. తదుపరి షెడ్యూల్ త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది. ఏపీలో 81 గ్రూప్-1 పోస్టుల భర్తీకి మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షలో మొత్తం 1లక్ష 48వేల 881 మంది ఈ పరీక్షకు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో 4వేల 496 మంది మాత్రమే మెయిన్స్‌కు అర్హత సాధించారు.

What's Your Reaction?