Army Truck : లోయలో పడిన ఆర్మీ ట్రక్కు.. ముగ్గురు జవాన్లు దుర్మరణం
అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబంసిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన నలుగురు సైనికులను హెలికాప్టర్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వాళ్లలో హవల్దార్ నఖత్ సింగ్, నాయక్ ముఖేష్ కుమార్, గ్రెనేడియర్ ఆశిష్ ఉన్నట్లుగా సమాచారం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు భారత సైన్యం అండగా నిలుస్తుందని ఈస్టర్న్ కమాండ్ ఆర్మీ ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఎవరూ అధైర్యం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరింది.
అరుణాచల్ ప్రదేశ్‌లోని సుబంసిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు లోయలో పడటంతో ముగ్గురు ఆర్మీ సిబ్బంది మృతి చెందారు. మరో నలుగురు గాయపడినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే ఆర్మీ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. గాయపడిన నలుగురు సైనికులను హెలికాప్టర్ ద్వారా స్థానిక ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వాళ్లలో హవల్దార్ నఖత్ సింగ్, నాయక్ ముఖేష్ కుమార్, గ్రెనేడియర్ ఆశిష్ ఉన్నట్లుగా సమాచారం.
ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు భారత సైన్యం అండగా నిలుస్తుందని ఈస్టర్న్ కమాండ్ ఆర్మీ ఎక్స్ లో ఓ ప్రకటన విడుదల చేసింది. ఎవరూ అధైర్యం, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కోరింది.
What's Your Reaction?