Balakrishna : బాలయ్య ఫ్యాన్స్ కోసం మరో రీ రిలీజ్

నందమూరి బాలకృష్ణ మరికొన్ని రోజుల్లోనే ఇండస్ట్రీలో 50యేళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో ఆయన అభిమానులతో పాటు పరిశ్రమ పెద్దలు కలిసి ఓ పెద్ద వేడుక నిర్వహించబోతున్నాడు. సెప్టెంబర్ 1న ఈ ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్స్ తో పాటు బాలయ్య సమకాలీకులైన అందరు హీరోలను ఇన్వైట్ చేశారు. అక్కడికి ఎవరు వస్తారు అనేది తర్వాత తెలుస్తుంది. మరి ఇలాంటి గ్రాండ్ ఈవెంట్ తో పాటు ఆయన నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని కూడా రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది. యస్.. ఫ్యాన్స్ ఆ పని కూడా చేస్తున్నారు.ఈ నెల 30న బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన 'నరసింహ నాయుడు'ను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీ ఒకసారి రీ రిలీజ్ అయింది. అందుకే 4కే అప్డేట్ తో రెడీగా ఉంది కాబట్టే మరోసారి విడుదల చేస్తున్నారు. 30 నుంచి నరసింహనాయుడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రానికి ఫస్ట్ టైమ్ బాలయ్యకు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ రావడం విశేషం. రిలీజ్ టైమ్ లో ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టింది. బి గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య ససన సిమ్రన్, ప్రీతి జింగానియా, ఆశాశైనీ హీరోయిన్లుగా నటించారు. నరసింహ నాయుడు మూవీ డైలాగ్స్ తో పాటు ఫైట్స్ కు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో యాక్షన్ మూవీనే అయినా అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంట్ కూడా కలిసి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించుకుంది. మరి ఇలాంటి మూవీ నటుడుగా బాలయ్య 50 వసంతాల వేడుక సందర్భంగా విడుదల చేస్తే ఫ్యాన్స్ కూ ఓ కిక్ ఉంటుంది కదా.

Aug 26, 2024 - 09:55
Aug 26, 2024 - 10:01
 0  2
Balakrishna : బాలయ్య ఫ్యాన్స్ కోసం మరో రీ రిలీజ్

నందమూరి బాలకృష్ణ మరికొన్ని రోజుల్లోనే ఇండస్ట్రీలో 50యేళ్లు పూర్తి చేసుకోబోతున్నాడు. దీంతో ఆయన అభిమానులతో పాటు పరిశ్రమ పెద్దలు కలిసి ఓ పెద్ద వేడుక నిర్వహించబోతున్నాడు. సెప్టెంబర్ 1న ఈ ఫంక్షన్ ను చాలా గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇండస్ట్రీలోని సీనియర్ స్టార్స్ తో పాటు బాలయ్య సమకాలీకులైన అందరు హీరోలను ఇన్వైట్ చేశారు. అక్కడికి ఎవరు వస్తారు అనేది తర్వాత తెలుస్తుంది. మరి ఇలాంటి గ్రాండ్ ఈవెంట్ తో పాటు ఆయన నటించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీని కూడా రీ రిలీజ్ చేస్తే ఎలా ఉంటుంది. యస్.. ఫ్యాన్స్ ఆ పని కూడా చేస్తున్నారు.

ఈ నెల 30న బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటైన 'నరసింహ నాయుడు'ను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ మూవీ ఒకసారి రీ రిలీజ్ అయింది. అందుకే 4కే అప్డేట్ తో రెడీగా ఉంది కాబట్టే మరోసారి విడుదల చేస్తున్నారు. 30 నుంచి నరసింహనాయుడు థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రానికి ఫస్ట్ టైమ్ బాలయ్యకు బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ రావడం విశేషం. రిలీజ్ టైమ్ లో ఎన్నో రికార్డులు బద్ధలు కొట్టింది. బి గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో బాలయ్య ససన సిమ్రన్, ప్రీతి జింగానియా, ఆశాశైనీ హీరోయిన్లుగా నటించారు.

నరసింహ నాయుడు మూవీ డైలాగ్స్ తో పాటు ఫైట్స్ కు ఇప్పటికీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఫ్యాక్షన్ నేపథ్యంలో యాక్షన్ మూవీనే అయినా అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంట్ కూడా కలిసి పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించుకుంది. మరి ఇలాంటి మూవీ నటుడుగా బాలయ్య 50 వసంతాల వేడుక సందర్భంగా విడుదల చేస్తే ఫ్యాన్స్ కూ ఓ కిక్ ఉంటుంది కదా.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News