Balakrishna: నందమూరి బాలకృష్ణ కి విలన్ గా గోపీచంద్

Balakrishna: నందమూరి బాలకృష్ణ కి విలన్ గా గోపీచంద్

Sep 7, 2024 - 10:23
Sep 7, 2024 - 10:37
 0  107
Balakrishna: నందమూరి బాలకృష్ణ కి విలన్ గా గోపీచంద్
Balakrishna: నందమూరి బాలకృష్ణ కి విలన్ గా గోపీచంద్

పవర్ ఫుల్ హీరోలు కావాలంటే పవర్ ఫుల్ విలన్స్ కావాలి. ఆ విలనిజం చేయాలంటే అతనికి ఓ రేంజ్ ఉండాలి. కటౌట్ నుంచి స్టేచర్ వరకూ నెక్ట్స్ లెవల్ లో ఉంటేనే ఆ స్ట్రాంగ్ హీరోకు ఈ విలన్ పోటీగా కనిపిస్తాడు. లేదంటే హీరోయిజమే తేలిపోతుంది. ఇక బాలకృష్ణ లాంటి హీరోకు విలన్ అంటే ఇంకో రేంజ్ లో కనిపిచాలి. అదీ బోయపాటి శ్రీను సినిమా అయితే ఇంక చెప్పేదేముందీ.. (Balakrishna, Gopichand, :బాలకృష్ణకు, విలన్, గా, గోపీచంద్..,Balakrishna: నందమూరి బాలకృష్ణ కి విలన్ గా గోపీచంద్వెండితెరపై నువ్వా నేనా అన్నట్టుగా హీరో, విలన్ ఉండాలి. అందుకే ఈ సారి బాలయ్య - బోయపాటి కాంబోలో వచ్చే మూవీలో విలన్ గా గోపీచంద్ ను తీసుకోవాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

గోపీచంద్ ఆల్రెడీ విలన్ గా అద్భుతం అనేలా కెరీర్ ఆరంభంలోనే అదరగొట్టాడు. బట్ హీరోగా పరిచయమైన తను విలన్ గా కొనసాగడం ఇష్టం లేక తన తండ్రి టి కృష్ణ ఫ్రెండ్, తన మెంటార్ పోకూరి బాబూరావు నిర్మించిన యజ్ఞంతో మళ్లీ హీరోగా మారాడు. అప్పటి నుంచి అలాగే కంటిన్యూ అవుతున్నాడు. మధ్యలో ఎన్నో పవర్ ఫుల్ స్టోరీస్ లో విలన్ గా చేయమని ఆఫర్స్ వచ్చినా చేయలేదు. పైగా కొన్నాళ్లుగా వరుస ఫ్లాపులు చూస్తున్నాడు. ఇలా ఫ్లాపులు వచ్చిన ప్రతిసారీ.. అందరూ ఇంక విలన్ గా చేసుకోవడమే దెప్పి పొడుస్తున్నారు కూడా. ఇలాంటి టైమ్ లో మరోసారి పవర్ కాంబినేషన్ లో విలన్ గా నటించే అవకాశం అంటే హీరోగా కెరీర్ ను ఫణంగా పెట్టడమే అనుకోవాలి. బట్ బోయపాటి సినిమాల్లో హీరోలు విలన్స్ గా మారి కెరీర్ కే కొత్త టర్న్ తీసుకున్నారు. అందుకే గోపీచంద్ ను బాలయ్యకు విలన్ గా చేయాలనుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఇంకా గోపీచంద్ ను బోయపాటి శ్రీను కలవలేదంటున్నారు. అంటే అతనికి కథ తెలియదు. కలిసి కథ చెబితే కన్విన్సింగ్ గా ఉంటే అప్పుడు ఆలోచిస్తాడేమో కానీ.. ఇప్పటికైతే ఇంకా గోపీచంద్ కు విషయం తెలిసి ఉంటుంది కానీ.. ఆ వైపు స్టెప్ తీసుకోలేదు అనే అనుకోవాలి. బట్ విశ్వం హిట్ అయితే ఇక గోపీచంద్ విలన్ అంటే ఇమ్మీడియొట్ గా నో అనేస్తాడు అది మాత్రం క్లియర్. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News