Bangalore Highway : బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం.. 14 వెహికల్స్ ఢీ..
బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకరు స్పాట్ లో చనిపోగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు - క్రిష్ణగిరి హైవేపై హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొంది.. అయితే జాతీయ రహదారి కావడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. గాయపడిన వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు - క్రిష్ణగిరి హైవే పై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 8 కార్లు, రెండు బస్సులు, 4 లారీలు ధ్వంసమయ్యాయి. ఒకరు స్పాట్ లో చనిపోగా మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హోసూరు, క్రిష్ణగిరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బెంగళూరు - క్రిష్ణగిరి హైవేపై హోసూరు సమీపంలోని పేరండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. గ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందు వెళ్తున్న కారును ఢీకొంది.. అయితే జాతీయ రహదారి కావడంతో వెనుక వస్తున్న వాహనాలు ఒకదాన్ని ఒకటి ఢీకొన్నాయి. గాయపడిన వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది.
బెంగళూరు - క్రిష్ణగిరి హైవే పై కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
What's Your Reaction?