BCCI | మహిళా క్రికెట్‌కు మహర్దశ.. దేశవాళీ హీరోలకు ప్రైజ్‌మనీ
BCCI : రంజీలపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ లీగ్స్‌లో మెరిసిన హీరోలకు ప్రైజ్‌మనీ(Prize Money) ఇచ్చేందుకు సిద్దమైంది. 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'(Player Of The Match), 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన వాళ్లకు నగదు బహుమతి ఇవ్వాలని తీర్మానించింది.
BCCI : రంజీలపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవాళీ లీగ్స్‌లో మెరిసిన హీరోలకు ప్రైజ్‌మనీ(Prize Money) ఇచ్చేందుకు సిద్దమైంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన వాళ్లకు నగదు బహుమతి ఇవ్వాలని తీర్మానించింది. ఈ విషయాన్ని సెక్రటరీ జై షా(Jai Shah) ఎక్స్ వేదికగా వెల్లడించాడు.
దేశవాళీ లీగ్స్‌తో పాటు జూనియర్ క్రికెట్ టోర్నమెంట్‌లలో అద్భుతంగా రాణించిన మహిళా క్రికెటర్లకు బీసీసీఐ ప్రైజ్‌మనీ అందివ్వనుందని షా చెప్పాడు. అయితే.. ఎంత నగదు ఇవ్వనుంది అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. దేశవాళీ క్రికెట్ కార్యక్రమంలో భాగంగా మహిళల జూనియర్ క్రికెట్ టోర్నమెంట్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ విజేతలకు నగదు బహుమతి ప్రవేశ పెడుతున్నాం. విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి దేశవాళీ ట్రోఫీల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన వాళ్లకు ప్రైజ్‌మనీ ఇస్తాం అని షా తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
We are introducing prize money for the Player of the Match and Player of the Tournament in all Women’s and Junior Cricket tournaments under our Domestic Cricket Programme. Additionally, prize money will be awarded for the Player of the Match in the Vijay Hazare and Syed Mushtaq…
— Jay Shah (@JayShah) August 26, 2024
రెండేండ్ల క్రితం మహిళల ప్రీమియర్ లీగ్(WPL)తో అమ్మాయిల క్రికెట్‌కు మహర్ధశ తెచ్చిన బీసీసీఐ దేశవాళీ లీగ్స్‌పై దృష్టి పెట్టింది. జూనియర్ స్థాయి నుంచి రాణించే అమ్మాయిలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో నగదు బహుమతిని ప్రకటించనుంది. భావి క్రికెటర్ల కోసం బెంగళూరులో కొత్త నేషనల్ క్రికెట్ అకాడమీ(NCA)ని నిర్మించిన బీసీసీఐ దేశవాళీ లీగ్స్‌తో పాటు టెస్టు క్రికెట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది.
ఏదైనా గాయం తర్వాత మళ్లీ టెస్టు జట్టుకు ఎంపిక కావాలంటే కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధన తీసుకొచ్చింది. అందులో భాగంగానే నిరుడు శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను రంజీల్లో ఆడాల్సిందిగా ఆదేశించింది. అయినా వాళ్లు మాట వినకపోవడంతో వాళ్లిద్దరి సెంట్రల్ కాంట్రాక్ట్‌ను బీసీసీఐ రద్దు చేసిన విషయం తెలిసిందే.
What's Your Reaction?