Big News: నిండు గర్భిణీ భార్యను హతమార్చిన కసాయి భర్త...
Big News: నిండు గర్భిణీ భార్యను హతమార్చిన కసాయి భర్త...

విశాఖ జిల్లా:ఏప్రిల్ 14 విశాఖ మధురవాడలో దారుణ ఘటన సోమవారం వెలుగు చూసింది. నిండు గర్భిణీని చంపేశాడో దుర్మార్గపు భర్త. విశాఖ జిల్లాకు చెందిన గెద్దాడ జ్ఞానేశ్వరరావు, అనూష రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరూ ఒంటరిగా మధురవాడ పీఎం పాలెం ఊడా కాలనీలో నివాసం ఉంటున్నారు.
స్కౌట్స్, సాగర్ నగర్ వ్యూ పాయింట్ వద్ద జ్ఞానేశ్వర్ రెండు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనూష గర్భం దాల్చింది. మరో 24 గంటల్లో ప్రసవించనుంది. అయితే వారిద్దరి మధ్య కొన్ని నెలలుగా మనస్పర్థ లు చోటు చేసుకున్నాయి. దీంతో అప్పుడప్పుడూ గొడవపడేవాడు. అయితే సోమవారం ఉదయం సైతం వారి మధ్య వివాదం తలె త్తింది. అది కాస్త ఘర్షణకు దారి తీసింది.
గర్భిణీ అనే విషయం మరిచి రెచ్చిపోయిన అతను భార్యపై దాడి చేశాడు. ఆమె గొంతు నులిమి అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తన బంధువు లు, స్నేహితులకు ఫోన్ చేసి అనూషకు ఆరోగ్యం బాగోలేదని చెప్పాడు. వెంటనే రావాలని కోరాడు. దీంతో హుటాహుటిన వారందరూ అక్కడికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సదరు యువతి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో అనూష మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు.
What's Your Reaction?






