Bihar Elections : బిహార్ ఎన్నికల్లో 243 స్థానాల్లో పోటీ చేస్తం : ప్రశాంత్ కిశోర్
బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాల్లో తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలోకి దించుతున్నట్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెలిపారు. తాను చేపడుతున్న ‘జన్ సురాజ్’ యాత్రను రాజకీయ పార్టీగా మలచనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ఆయన.. వచ్చే ఏడాది జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టనున్నట్లు తెలిపారు.అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున పార్టీని ప్రారంభించబోతున్నట్లు ఇటీవల ప్రశాంత్ కిశోర్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... మొత్తం అన్ని స్థానాల్లోనూ ‘జన్ సురాజ్’ అభ్యర్థుల్ని బరిలో దించుతామన్నారు. వారిలో కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు ఉంటారని చెప్పారు. ఆ తర్వాత 2030 ఎన్నికల్లో కనీసం 70 నుంచి 80 మంది అభ్యర్థుల్ని బరిలో నిలుపుతామన్నారు.

What's Your Reaction?