BJP : బీజేపీలో చేరిన ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్

ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ జేఎంఎంతో విభేదించిన చంపై గ‌త కొన్ని రోజులుగా సొంత పార్టీ పెడ‌తార‌ని, బీజేపీలో చేర‌తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఇటీవ‌ల ఆయ‌న‌ బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో స‌మావేశ‌మై పార్టీలో చేరిక‌పై సమాలోచనలు జరిపారు. ఇవాళ రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత సమక్షంలో బీజేపీలో చేరారు.కాగా, సొంతపార్టీపై చంపై సోరెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జేఎంఎంకు ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు. గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్‌ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. బంగ్లాదేశ్‌ చొరబాట్లతో ప్రమాదంలో పడిన గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి ఈస్ధాయికి చేరుకున్నానని, జార్ఖండ్‌ అభివృద్ధితో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకే తాను కాషాయ పార్టీలో చేరుతున్నానని చంపై సోరెన్‌ వెల్లడించారు.

Aug 31, 2024 - 11:43
 0  12
BJP : బీజేపీలో చేరిన ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్

ఝార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో తనకు అన్యాయం జరిగిందంటూ జేఎంఎంతో విభేదించిన చంపై గ‌త కొన్ని రోజులుగా సొంత పార్టీ పెడ‌తార‌ని, బీజేపీలో చేర‌తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. అయితే, ఇటీవ‌ల ఆయ‌న‌ బీజేపీ అగ్ర‌నేత‌ల‌తో స‌మావేశ‌మై పార్టీలో చేరిక‌పై సమాలోచనలు జరిపారు. ఇవాళ రాంచీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, అస్సాం సీఎం హిమంత సమక్షంలో బీజేపీలో చేరారు.

కాగా, సొంతపార్టీపై చంపై సోరెన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. జేఎంఎంకు ఇటీవలే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీలో అన్ని పదవులకు రాజీనామా చేసినట్లు లేఖ విడుదల చేశారు. ఆ తర్వాత తాను బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వర్తిస్తానని అన్నారు.

గిరిజనుల సంక్షేమంతో పాటు జార్ఖండ్‌ ప్రజల అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. బంగ్లాదేశ్‌ చొరబాట్లతో ప్రమాదంలో పడిన గిరిజనులకు బాసటగా నిలుస్తామని స్పష్టం చేశారు. తాను ఎంతో కష్టపడి ఈస్ధాయికి చేరుకున్నానని, జార్ఖండ్‌ అభివృద్ధితో పాటు గిరిజనుల ఉనికిని కాపాడేందుకే తాను కాషాయ పార్టీలో చేరుతున్నానని చంపై సోరెన్‌ వెల్లడించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News