Boat Accident : యెమెన్ తీరంలో పడవ ప్రమాదం.. 13మంది మృతి.. 14మంది గల్లంతు

యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడంతో 13 మంది మృతి చెందారు. మరో 14 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో వలస పడవ బోల్తా పడింది. ఈ పడవలో తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన 25 మంది పౌరులు ఉన్నారు. ఇద్దరు యెమెన్‌కు చెందినవారు ఉన్నారు. కాగా.. ఈ పడవ తూర్పు ఆఫ్రికా దేశం జిబౌటి నుండి బయలుదేరింది.చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు అన్వేషణ కొనసాగిస్తోంది. తప్పిపోయిన వారిలో యెమెన్ కెప్టెన్.. అతని సహాయకుడు కూడా ఉన్నారు. ఓడ బోల్తా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. ఇది ప్రమాదకరమైనది అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వలసదారులు ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నారని యెమెన్‌లోని IOM మిషన్ యొక్క తాత్కాలిక అధిపతి చెప్పారు. జూన్-జూలైలో కూడా పడవ బోల్తా పడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.

Aug 26, 2024 - 20:05
 0  2
Boat Accident : యెమెన్ తీరంలో పడవ ప్రమాదం.. 13మంది మృతి.. 14మంది గల్లంతు

యెమెన్ తీరంలో ఘోర ప్రమాదం జరిగింది. పడవ మునిగిపోవడంతో 13 మంది మృతి చెందారు. మరో 14 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు జరుగుతున్నాయి.

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. యెమెన్‌లోని తైజ్ ప్రావిన్స్ తీరంలో వలస పడవ బోల్తా పడింది. ఈ పడవలో తూర్పు ఆఫ్రికా దేశం ఇథియోపియాకు చెందిన 25 మంది పౌరులు ఉన్నారు. ఇద్దరు యెమెన్‌కు చెందినవారు ఉన్నారు. కాగా.. ఈ పడవ తూర్పు ఆఫ్రికా దేశం జిబౌటి నుండి బయలుదేరింది.

చనిపోయిన వారిలో 11 మంది మహిళలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు అన్వేషణ కొనసాగిస్తోంది. తప్పిపోయిన వారిలో యెమెన్ కెప్టెన్.. అతని సహాయకుడు కూడా ఉన్నారు. ఓడ బోల్తా పడటానికి గల కారణాలు తెలియరాలేదు. ఇది ప్రమాదకరమైనది అయినప్పటికీ, పెద్ద సంఖ్యలో వలసదారులు ఈ సముద్ర మార్గం గుండా ప్రయాణిస్తున్నారని యెమెన్‌లోని IOM మిషన్ యొక్క తాత్కాలిక అధిపతి చెప్పారు. జూన్-జూలైలో కూడా పడవ బోల్తా పడిన సంఘటనలు ఉన్నాయని తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News