Breaking News: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి
Breaking News: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (92) తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో గురువారం రోజు సాయంత్రం ఢిల్లీ AIMS Lo Cherina మన్మోహన్ సింగ్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మన్మోహన్ సింగ్.. ఇంట్లో అకస్మాత్తుగా స్పృహకోల్పోవటంతో రాత్రి 8:06 గంటలకు హుటాహుటిన ఎయిమ్స్‌లోని మెడికల్ ఎమర్జెన్సీకి తరలించారు.
అయితే మన్మోహన్ ఆరోగ్యం పూర్తిగా విషమించటంతో రాత్రి 9:51 గంటలకు మన్మోహన్ కన్నుమూసినట్టు ఎయిమ్స్ ప్రకటించింది.మన్మోహన్ సింగ్ మరణ వార్త విని రాజకీయ ప్రముఖులు ఎయిమ్స్‌కు చేరుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ తదితర నేతలు ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
What's Your Reaction?