Breaking News: అక్కడ ఇకపై వారానికి 4 రోజులే పని దినాలు

Breaking News: అక్కడ ఇకపై వారానికి 4 రోజులే పని దినాలు

Sep 1, 2024 - 10:39
Sep 1, 2024 - 11:44
 0  48
Breaking News: అక్కడ ఇకపై వారానికి 4 రోజులే పని దినాలు
Breaking News: అక్కడ ఇకపై వారానికి 4 రోజులే పని దినాలు

జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పని చేసే విధానాన్ని తీసుకు వస్తోంది. అన్ని సంస్థల్లో ఇది అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జపాన్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. వాస్తవానికి మూడేళ్ల క్రితమే జపాన్ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ మెజార్టీ సంస్థలు అంగీకరించలేదు. అప్పుడు కేవలం ఎనిమిది శాతం సంస్థలే దీనిని అమలు చేశాయి.

జపాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ విధానం అన్ని సంస్థల్లో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు జపాన్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టసభ సభ్యులు ఈ ఆలోచనను ఆమోదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని 2021లోనే అమలు చేయాలని జపాన్‌ నిర్ణయం తీసుకుంది. ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే చాలా సంస్థలు ఈ విధానాన్ని వ్యతిరేకించాయి. ఇలా చేయడం వల్ల అభివృద్ధి విషయంలో కొంత కాలానికి జపాన్‌ వెనుకపడే ప్రమాదం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశాయి. కేవలం 8 శాతం సంస్థలే దానిని అనుసరించాయి. మిగిలిన సంస్థలు కూడా తమ ఉద్యోగులతో వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేయించుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా నిర్ణయంతో ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా నిరుద్యోగం కొంతైనా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడింది. తక్కువ పని దినాలు ఉండడం వల్ల కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతూ పిల్లల పెంపకంపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని పేర్కొంది. వారానికి నాలుగు పని దినాల విధానాన్ని ప్రస్తుతం టోక్యోలోని అకికో యోకోహామా అనే సంస్థ పాటిస్తోంది. దీని ప్రకారం తమ ఉద్యోగులకు శని, ఆదివారాలతో పాటు బుధవారం హాలిడే ఇస్తోంది. ఈ విధంగా చేయడం వల్ల ఉద్యోగులు ఒత్తిడికి గురి కాకుండా చురుగ్గా పని చేస్తున్నట్లు అక్కడి యాజమాన్యం తెలిపిండి. అంతే కాకుండా తక్కువ పని దినాలు ఉండటంతో ఉద్యోగులు మరింత వేగంగా పనులను పూర్తి చేస్తున్నారని వెల్లడించింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News