Cabinet Decisions: విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం
విద్యార్థులకు ఇంటర్న్షిప్
విజ్ఞాన్ ధార పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఐటీశాఖ అమలు చేస్తున్న మూడు పథకాలను విలీనం చేసి ‘విజ్ఞాన్ ధార’ పేరుతో కొత్త పథకం తీసుకొచ్చింది. 15వ ఆర్థిక సంఘం కాలమైన 2021-22 నుంచి 2025-26 మధ్య రూ.10,579 కోట్ల వ్యయంతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ పథకం కింద 11వ, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, యూజీ, పీజీ, పీహెచ్‌డీ, పోస్ట్ డాక్టరల్ రిసెర్చ్ విద్యార్థులకు ఫెలోషిప్‌లు అందించనుంది.
అధునాతన పరిశోధనల కోసం అంతర్జాతీయ భాగస్వామ్యం, సంయుక్త పరిశోధనా ప్రాజెక్టులు, ఫెలోషిప్‌లు వంటివి ఈ పథకంలో ఉంటాయి. ఆర్థిక, పర్యావరణ, ఉపాధి కోసం జీవసాంకేతిక విజ్ఞానం(బయో ఈ3) విధానానికి సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. స్వచ్ఛ ఇంధన, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీ, పరిశోధన, ఈ రంగంలోని నూతన సాంకేతికత ప్రోత్సాహానికి ఈ విధానం ఉపయోగపడుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
What's Your Reaction?