CCI : రిలయన్స్ – డిస్నీ డీల్ ఓకే
రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ మధ్య కుదిరిన మీడియా వ్యాపార విలీనానికి సీసీఐ(కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా)ఆమోద ముద్ర వేసింది. విలీనానికి సంబంధించి 6 నెలల క్రితమే ఇరు సంస్థలు ప్రకటన చేయగా.. తాజాగా సీసీఐ ఆమోదం ముద్ర వేసింది. చిన్నపాటి మార్పులతో డీల్‌కు ఆమోదం తెలిపినట్లు సీసీఐ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది.‘రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వయాకామ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, డిజిటల్ 18 మీడియా లిమిటెడ్, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, స్టార్ టెలివిజన్ ప్రొడక్షన్స్ లిమిటెడ్ వంటి సంస్థలకు సంబంధిత ప్రతిపాదిత విలీన ప్రక్రియ స్వచ్ఛంద సవరణకు లోబడి ఆమోదం పొందింది ’అని సీసీఐ పేర్కొంది. అయితే, ఆ సవరణలు ఏంటనేవి మాత్రం సీసీఐ వెల్లడించలేదు. విలీనం వల్ల పోటీపరంగా ఇబ్బందులు తలెత్తొచ్చని సీసీఐ ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన కొద్దిరోజులకే ఆమోదం లభించడం గమనార్హం. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్, వాల్ట్ డిస్నీ కంపెనీకి చెందిన స్టార్ ఇండియాల మధ్య 8.5 బిలియన్ డాలర్లు.. అంటే రూ.70 వేల 550 కోట్లకు ఈ ఏడాది విలీన ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ విలీనం పూర్తయ్యాక 120 టీవీ చానెల్స్, రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లతో కూడిన అతిపెద్ద మీడియా సంస్థగా అవతరించనుంది. విలీన సంస్థలో రిలయన్స్‌కు 63.16 శాతం వాటా దఖలు పడనుండగా.. వాల్ట్ డిస్నీకి 36.84 శాతం ఉండనుంది. ఈ మీడియా వెంచర్‌కు ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వాల్ట్ డిస్నీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఉదయ్ శంకర్ వైస్ ఛైర్మన్‌గా ఉంటారు.

What's Your Reaction?