ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రజలందరి కలలు నెరవేరి, ప్రతి ఇంటా సంతోషాలు నిండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ప్రభుత్వ చీఫ్‌విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయు లు. 2025 అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యం, సుఖ, శాంతులు, సమృద్ధిలు అందించాలన్నదే తన నూతన సంవత్సర శుభాకాంక్షలుగా పేర్కొన్నారు.
నవ్యాంధ్ర నిర్మాణ శ్రామికుడు సీఎం చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి కోసం అందరు కలిసి కట్టుగా పనిచేద్దామని మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో చీఫ్ విప్ జీవీ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుది, తనది ఒకటే లక్ష్యమని, పంట పొలాలు పచ్చగా ఉండాలి, ప్రతి ఒక్క లోగిలి ఆనందం, ఆరోగ్యాలతో ఉండాలన్నారు.
అలానే అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం పూర్తయి రాష్ట్రం మరింత అభివృద్ధి చెంది దేశంలోనే అగ్రగామిగా నిలవాలి. ప్రపంచంలోనే ఆంధ్రుల ఖ్యాతి రెపరెపలాడాలని కోరుకుంటన్నా అంటూ వినుకొండ నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి కొత్త ఏడాది ఎన్నో కొత్త అవకాశాలు కల్పిస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుని ప్రతిఒక్కరూ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలువైపులా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఈ కొత్త ఏడాదిని ఉత్సాహంగా స్వాగతిద్దాం పిలుపునిచ్చారు చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు.
What's Your Reaction?