Chiranjeevi : అభిమాని ఈశ్వ‌రయ్య కుటుంబాన్ని స‌త్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి

ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య అనే అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి త‌న అభిమానాన్ని చాటుకున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈ విష‌యం తెలియ‌గానే చిరంజీవి, ఈశ్వ‌రయ్య, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారిక కుటుంబానికి పట్టు బ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించటం విశేషం. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ హామీనిచ్చారు.సోమవారం రోజున చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ను ధరించారు. ప్ర‌తీ ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాల‌ను ధ‌రించారు. మాల‌ధార‌ణ‌లోనూ ఈశ్వ‌ర‌య్య కుటుంబంతో చిరంజీవి క‌లిసి మాట్లాడారు. సాధార‌ణంగా చిరంజీవి త‌న హార్డ్ కోర్ అభిమానుల‌కు ఎప్పుడూ అండ‌గా నిలుస్తుంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది నిరూప‌ణ అయ్యింది. ఇప్పుడు ఈశ్వ‌ర‌య్య గురించి తెలియ‌గానే మ‌రోసారి మెగాస్టార్ ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు. గతంలో ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి మెగాస్టార్ ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజుకు, జనసేన పార్టీ నెగ్గాల‌ని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయ‌టం విశేషం.

Aug 26, 2024 - 20:05
 0  1
Chiranjeevi : 
అభిమాని ఈశ్వ‌రయ్య కుటుంబాన్ని స‌త్క‌రించిన మెగాస్టార్ చిరంజీవి

ఆగ‌స్ట్ 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య అనే అభిమాని తిరుప‌తి నుంచి తిరుమ‌ల కొండ వ‌ర‌కు పొర్లు దండాలు పెట్టుకుంటూ వెళ్లి త‌న అభిమానాన్ని చాటుకున్న సంగ‌తి అందరికీ తెలిసిందే. ఈ విష‌యం తెలియ‌గానే చిరంజీవి, ఈశ్వ‌రయ్య, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను హైద‌రాబాద్‌లోని త‌న ఇంటికి ప్ర‌త్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. వారిక కుటుంబానికి పట్టు బ‌ట్ట‌లు పెట్టి స‌త్క‌రించటం విశేషం. ఈ సంద‌ర్భంగా ఈశ్వ‌ర‌య్య కుటుంబానికి అండ‌గా ఉంటాన‌ని మెగాస్టార్ హామీనిచ్చారు.

సోమవారం రోజున చిరంజీవి అయ్య‌ప్ప మాల‌ను ధరించారు. ప్ర‌తీ ఏడాది అయ్య‌ప్ప మాల‌ను ధరించే ఆయన ఈ ఏడాది కూడా మాల‌ను ధ‌రించారు. మాల‌ధార‌ణ‌లోనూ ఈశ్వ‌ర‌య్య కుటుంబంతో చిరంజీవి క‌లిసి మాట్లాడారు. సాధార‌ణంగా చిరంజీవి త‌న హార్డ్ కోర్ అభిమానుల‌కు ఎప్పుడూ అండ‌గా నిలుస్తుంటారు. చాలా సంద‌ర్భాల్లో ఇది నిరూప‌ణ అయ్యింది. ఇప్పుడు ఈశ్వ‌ర‌య్య గురించి తెలియ‌గానే మ‌రోసారి మెగాస్టార్ ఆయ‌న్ని ప్ర‌త్యేకంగా క‌లుసుకున్నారు.

గతంలో ఈశ్వ‌ర‌య్య తిరుప‌తి నుంచి మెగాస్టార్ ఇంటి వ‌ర‌కు సైకిల్ యాత్ర‌ను నిర్వ‌హించారు. అదే విధంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజుకు, జనసేన పార్టీ నెగ్గాల‌ని ఇలా అనేక సార్లు పొర్లు దండాలు చేయ‌టం విశేషం.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News