Chiranjeevi Indra : ఇంద్ర ఓకే.. జగదేక వీరుడు అవసరమా..?
ఇంద్ర రీ రిలీజ్ తో మంచి విజయం సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మెయిన్ టీమ్ అంతా ఒక కలిసి కూర్చుని ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ తో పాటు నిర్మాత అశ్వనీదత్, రచయితలు పరుచూరి బ్రదర్స్, దర్శకుడు బి గోపాల్ తో పాటు ఇంద్ర విజయంలో కీలక పాత్ర పోషించిన మణిశర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్లు ఎన్నో మెమరీస్ షేర్ చేసుకున్నారు. అయితే మాటల్లో నిర్మాత అశ్వనీదత్ ఒక విషయం చెప్పాడు. తను చిరంజీవితో నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర చిత్రాలకు సీక్వెల్స్ తీస్తాను అని అన్నాడు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.నిజానికి జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ చేయాలని.. ఆ సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తే చూడాలని ఉందని చిరంజీవి చాలాసార్లు అన్నాడు. కానీ చాలామంది రకరకాల కామెంట్స్ చేశారు. టాలీవుడ్ హిస్టరీలో ఒక ఎపిక్ లాంటి మూవీ అది. దాన్ని మరో విధంగా తీసి చెడగొట్టొద్దు అన్నవాళ్లూ ఉన్నారు. ఇక చిరంజీవి ఉన్నాడు. కానీ శ్రీదేవి లేదు కదా. ఉంటే జాన్వీ చేత ఆమె అత్తా అని పిలిపించుకోవాల్సి ఉంటుంది కదా. అందుకే విమర్శలు వచ్చాయి. ఇలాంటి క్లాసిక్ సినిమాను మళ్లీ టచ్ చేయకపోవడమే బెటర్. ఇక ఇంద్రకు సీక్వెల్ చేయొచ్చు. ఆర్తి అగర్వాల్ శతృవుల దాడిలో చనిపోయినట్టు కవర్ చేయొచ్చు. సోనాలి బెంద్రే ఉంది. మెగాస్టార్ తన వయసుకు తగ్గట్టుగానే అప్పటి నుంచి సీమను శాసిస్తూ.. ఉన్నాడని.. మళ్లీ కొత్తగా కొందరు ఫ్యాక్షనిస్ట్ లు వచ్చారని చూపిస్తూ.. ఇంద్ర ఉన్నంత వరకూ ఫ్యాక్షన్ ఉండదు అనేలా ఫినిషింగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ మాస్ మూవీ కాబట్టి ఎలాగైనా చేయొచ్చు. అందుకే ఇంద్రకు సీక్వెల్ ఓకే. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరిని టచ్ చేయకపోవడమే మంచిదేమో.
ఇంద్ర రీ రిలీజ్ తో మంచి విజయం సాధించింది. ఈ మూవీ సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మెయిన్ టీమ్ అంతా ఒక కలిసి కూర్చుని ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. మెగాస్టార్ తో పాటు నిర్మాత అశ్వనీదత్, రచయితలు పరుచూరి బ్రదర్స్, దర్శకుడు బి గోపాల్ తో పాటు ఇంద్ర విజయంలో కీలక పాత్ర పోషించిన మణిశర్మ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్లు ఎన్నో మెమరీస్ షేర్ చేసుకున్నారు. అయితే మాటల్లో నిర్మాత అశ్వనీదత్ ఒక విషయం చెప్పాడు. తను చిరంజీవితో నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి, ఇంద్ర చిత్రాలకు సీక్వెల్స్ తీస్తాను అని అన్నాడు. ఇది చూసి చాలామంది ఆశ్చర్యపోయారు.
నిజానికి జగదేక వీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ చేయాలని.. ఆ సీక్వెల్ లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తే చూడాలని ఉందని చిరంజీవి చాలాసార్లు అన్నాడు. కానీ చాలామంది రకరకాల కామెంట్స్ చేశారు. టాలీవుడ్ హిస్టరీలో ఒక ఎపిక్ లాంటి మూవీ అది. దాన్ని మరో విధంగా తీసి చెడగొట్టొద్దు అన్నవాళ్లూ ఉన్నారు. ఇక చిరంజీవి ఉన్నాడు. కానీ శ్రీదేవి లేదు కదా. ఉంటే జాన్వీ చేత ఆమె అత్తా అని పిలిపించుకోవాల్సి ఉంటుంది కదా. అందుకే విమర్శలు వచ్చాయి. ఇలాంటి క్లాసిక్ సినిమాను మళ్లీ టచ్ చేయకపోవడమే బెటర్.
ఇక ఇంద్రకు సీక్వెల్ చేయొచ్చు. ఆర్తి అగర్వాల్ శతృవుల దాడిలో చనిపోయినట్టు కవర్ చేయొచ్చు. సోనాలి బెంద్రే ఉంది. మెగాస్టార్ తన వయసుకు తగ్గట్టుగానే అప్పటి నుంచి సీమను శాసిస్తూ.. ఉన్నాడని.. మళ్లీ కొత్తగా కొందరు ఫ్యాక్షనిస్ట్ లు వచ్చారని చూపిస్తూ.. ఇంద్ర ఉన్నంత వరకూ ఫ్యాక్షన్ ఉండదు అనేలా ఫినిషింగ్ ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇది రెగ్యులర్ కమర్షియల్ మాస్ మూవీ కాబట్టి ఎలాగైనా చేయొచ్చు. అందుకే ఇంద్రకు సీక్వెల్ ఓకే. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరిని టచ్ చేయకపోవడమే మంచిదేమో.
What's Your Reaction?