Chiranjeevi : మెగాస్టార్ పై భోళా శంకర్ ఎఫెక్ట్

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే దూకుడుతో ఉన్నాడు. రీసెంట్ గానే 69వ పుట్టిన రోజు జరుపుకున్న మెగాస్టార్.. ప్రస్తుతం విశ్వంభర అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. 30 యేళ్ల తర్వాత కీరవాణి చిరంజీవి మూవీకి సంగీతం చేస్తున్నాడు. విశ్వంభర షూటింగ్ ఈ నెలతో పూర్తవుతుంది. దీంతో తన బర్త్ డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడు అనుకున్నారు. బట్ చిరంజీవి నుంచి ఎలాంటి కొత్త సినిమా ప్రకటనా రాలేదు. దీంతో అసలేం జరుగుతుందా అని అంతా అనుకుంటున్నారు. అయితే దీనికి కారణం భోళా శంకర్ కావడం విశేషం.భోళా శంకర్ కు ముందు చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నాడు. తన ఇమేజ్ కి అనుగుణంగా ఉంటుంది.. కంప్లీట్ ఎంటర్టైనర్ అంటూ చేసిన భోళా శంకర్ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ కావడం కంటే ఈ సినిమా చేసినందుకు ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. ఈ వయసులో అంత కష్టపడుతూ ఫ్లాప్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు.. అని కమెంట్స్ కూడా చేశారు. అందుకే కథల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేవలం తన ఇమేజ్ మీదే రన్ అయ్యే స్టోరీస్ కంటే అవసరమైతే ఇతర కాస్టింగ్ సపోర్ట్ కూడా ఉండానుకుంటున్నాడు. అందుకే ఇప్పటి వరకూ చిరంజీవికి వెంకీ కుడుముల, కళ్యాణ్ కృష్ణ కురసాల, హరీశ్ శంకర్, అనుదీప్ వంటి దర్శకులు కథలు చెప్పి ఉన్నారు. కానీ ఇవన్నీ వాళ్లు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉన్నాయట. కొన్ని బానే ఉన్నా.. తన ఏజ్ కు సరిపోదు అని భావించినవీ ఉన్నాయని టాక్. విశేషం ఏంటంటే.. గాడ్ ఫాదర్ ను డైరెక్ట్ చేసి తనకు హిట్ ఇచ్చిన మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఉంటుందనే ప్రచారం బాగా సాగింది. ఆశ్చర్యంగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు బర్త్ డే రోజు. దీంతో అసలు ఆయన మైండ్ లో ఏముందీ అనుకుంటున్నారు చాలామంది. మరోవైపు విశ్వంభరతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ అవుతాయి.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ కు ఓకే చెబుదాం అనే ఆలోచనలోనూ ఉన్నాడంటున్నారు. బట్ అంత వరకూ ఆగకపోవచ్చు. ఈ లోగా ఏదో ఒక కొత్త ప్రకటన వచ్చే అవకాశమే ఉందంటున్నారు సన్నిహితులు. మరి మెగాస్టార్ కు భోళా శంకర్ ఇచ్చిన షాక్ వల్లే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ హోల్డ్ లో పడిపోయాయన్నమాట. 

Aug 24, 2024 - 22:28
Aug 24, 2024 - 22:31
 0  3
Chiranjeevi : మెగాస్టార్ పై భోళా శంకర్ ఎఫెక్ట్

మెగాస్టార్ చిరంజీవి ఈ వయసులో కూడా అదే దూకుడుతో ఉన్నాడు. రీసెంట్ గానే 69వ పుట్టిన రోజు జరుపుకున్న మెగాస్టార్.. ప్రస్తుతం విశ్వంభర అనే మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తున్నాడు. త్రిష హీరోయిన్. 30 యేళ్ల తర్వాత కీరవాణి చిరంజీవి మూవీకి సంగీతం చేస్తున్నాడు. విశ్వంభర షూటింగ్ ఈ నెలతో పూర్తవుతుంది. దీంతో తన బర్త్ డే సందర్భంగా కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తాడు అనుకున్నారు. బట్ చిరంజీవి నుంచి ఎలాంటి కొత్త సినిమా ప్రకటనా రాలేదు. దీంతో అసలేం జరుగుతుందా అని అంతా అనుకుంటున్నారు. అయితే దీనికి కారణం భోళా శంకర్ కావడం విశేషం.

భోళా శంకర్ కు ముందు చిరంజీవి వాల్తేర్ వీరయ్యతో బ్లాక్ బస్టర్ కొట్టి ఉన్నాడు. తన ఇమేజ్ కి అనుగుణంగా ఉంటుంది.. కంప్లీట్ ఎంటర్టైనర్ అంటూ చేసిన భోళా శంకర్ ఫ్లాప్ అయింది. ఫ్లాప్ కావడం కంటే ఈ సినిమా చేసినందుకు ఫ్యాన్స్ బాగా ఫీలయ్యారు. ఈ వయసులో అంత కష్టపడుతూ ఫ్లాప్ స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకోవడం ఎందుకు.. అని కమెంట్స్ కూడా చేశారు. అందుకే కథల ఎంపికలో మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కేవలం తన ఇమేజ్ మీదే రన్ అయ్యే స్టోరీస్ కంటే అవసరమైతే ఇతర కాస్టింగ్ సపోర్ట్ కూడా ఉండానుకుంటున్నాడు. అందుకే ఇప్పటి వరకూ చిరంజీవికి వెంకీ కుడుముల, కళ్యాణ్ కృష్ణ కురసాల, హరీశ్ శంకర్, అనుదీప్ వంటి దర్శకులు కథలు చెప్పి ఉన్నారు. కానీ ఇవన్నీ వాళ్లు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారో అలా ఉన్నాయట. కొన్ని బానే ఉన్నా.. తన ఏజ్ కు సరిపోదు అని భావించినవీ ఉన్నాయని టాక్.

విశేషం ఏంటంటే.. గాడ్ ఫాదర్ ను డైరెక్ట్ చేసి తనకు హిట్ ఇచ్చిన మోహన్ రాజా దర్శకత్వంలో మెగాస్టార్ నెక్ట్స్ మూవీ ఉంటుందనే ప్రచారం బాగా సాగింది. ఆశ్చర్యంగా ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ కూడా రాలేదు బర్త్ డే రోజు. దీంతో అసలు ఆయన మైండ్ లో ఏముందీ అనుకుంటున్నారు చాలామంది. మరోవైపు విశ్వంభరతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ అవుతాయి.. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ కు ఓకే చెబుదాం అనే ఆలోచనలోనూ ఉన్నాడంటున్నారు. బట్ అంత వరకూ ఆగకపోవచ్చు. ఈ లోగా ఏదో ఒక కొత్త ప్రకటన వచ్చే అవకాశమే ఉందంటున్నారు సన్నిహితులు. మరి మెగాస్టార్ కు భోళా శంకర్ ఇచ్చిన షాక్ వల్లే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ హోల్డ్ లో పడిపోయాయన్నమాట. 

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News