CM Chandrababu Naidu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి....
CM Chandrababu Naidu: తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి....
CM Chandrababu Naidu: ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, హోంమంత్రి అనిత తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. టోకెన్ల కోసం వెళ్లి పలువురు భక్తులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
బాధితులకు వెంటనే మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. తొక్కిసలాట జరిగిన ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. క్షతగ్రాతులకు అందుతున్న చికిత్సపై అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. జిల్లా, టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
What's Your Reaction?