CM Revanth Reddy : ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు: సీఎం రేవంత్
ప్రధాని మోదీ దేశాన్ని అప్పుల ఊబిలో ముంచారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘దేశంలో అన్ని యూనివర్సిటీలను, ప్రాజెక్టులను నెహ్రూ ప్రారంభించారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్లను దేశానికి పరిచయం చేశారు. తెలంగాణ బిడ్డ పీవీ సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టారు. మోదీ, అమిత్ షా కలిసి అదానీ, అంబానీలను తీసుకొచ్చారు. ఈ నలుగురు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు’ అని మండిపడ్డారు.నరేంద్ర మోదీ వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. బీజేపీకి 400 పార్లమెంటు సీట్లు వస్తాయని మోదీ అన్నారని, కానీ 240 సీట్లకు మించవని తాను ఆరోజే చెప్పానని రేవంత్ గుర్తు చేశారు. తాను చెప్పినట్లే బీజేపీకి సీట్లు వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ కి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాదని చెప్పానని, అలాగే జరిగిందని రేవంత్ అన్నారు.ఈ దేశానికి బీజేపీ ముప్పుగా మారిందని సీఎం రేవంత్ విమర్శించారు. మోదీపై కొట్లాడుతున్నామని బీఆర్ఎస్ చెబుతోందని, అలా అయితే సెబీ కుంభకోణంపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ‘ప్రతి చిన్నదానిపై స్పందించే కేటీఆర్ అదానీ వ్యవహారంపై ఎందుకు మాట్లాడట్లేదు. బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారనేందుకు ఇదే స్పష్టమైన సాక్ష్యం. మోదీ, అమిత్ షాను సంతోషపర్చడానికి రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటున్నారు’ అని ఫైరయ్యారు.
ప్రధాని మోదీ దేశాన్ని అప్పుల ఊబిలో ముంచారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ‘దేశంలో అన్ని యూనివర్సిటీలను, ప్రాజెక్టులను నెహ్రూ ప్రారంభించారు. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్లను దేశానికి పరిచయం చేశారు. తెలంగాణ బిడ్డ పీవీ సరళీకరణ విధానాలను ప్రవేశపెట్టారు. మోదీ, అమిత్ షా కలిసి అదానీ, అంబానీలను తీసుకొచ్చారు. ఈ నలుగురు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు’ అని మండిపడ్డారు.
నరేంద్ర మోదీ వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. బీజేపీకి 400 పార్లమెంటు సీట్లు వస్తాయని మోదీ అన్నారని, కానీ 240 సీట్లకు మించవని తాను ఆరోజే చెప్పానని రేవంత్ గుర్తు చేశారు. తాను చెప్పినట్లే బీజేపీకి సీట్లు వచ్చాయని అన్నారు. బీఆర్ఎస్ కి పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు రాదని చెప్పానని, అలాగే జరిగిందని రేవంత్ అన్నారు.
ఈ దేశానికి బీజేపీ ముప్పుగా మారిందని సీఎం రేవంత్ విమర్శించారు. మోదీపై కొట్లాడుతున్నామని బీఆర్ఎస్ చెబుతోందని, అలా అయితే సెబీ కుంభకోణంపై ఆ పార్టీ ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. ‘ప్రతి చిన్నదానిపై స్పందించే కేటీఆర్ అదానీ వ్యవహారంపై ఎందుకు మాట్లాడట్లేదు. బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలంగా ఉన్నారనేందుకు ఇదే స్పష్టమైన సాక్ష్యం. మోదీ, అమిత్ షాను సంతోషపర్చడానికి రాజీవ్ విగ్రహం తొలగిస్తామంటున్నారు’ అని ఫైరయ్యారు.
What's Your Reaction?