Coast Guard Rescues | సముద్రంలో మునిగిన కార్గో షిప్‌.. 11 మందిని రక్షించిన కోస్ట్‌ గార్డ్‌

Coast Guard Rescues | కార్గో షిప్‌ సముద్రంలో మునిగింది. ఆ నౌకకు చెందిన 11 మంది సిబ్బందిని కోస్ట్‌ గార్డ్‌ రక్షించింది. ఆపద గురించి తెలుసుకున్న వెంటనే కోస్ట్‌ గార్డ్‌ నౌకలు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ అనుకూలించని వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు.

Aug 26, 2024 - 23:31
 0  11
Coast Guard Rescues | సముద్రంలో మునిగిన కార్గో షిప్‌.. 11 మందిని రక్షించిన కోస్ట్‌ గార్డ్‌
Coast Guard Rescues

న్యూఢిల్లీ: కార్గో షిప్‌ సముద్రంలో మునిగింది. ఆ నౌకకు చెందిన 11 మంది సిబ్బందిని కోస్ట్‌ గార్డ్‌ రక్షించింది. (Coast Guard Rescues) ఆపద గురించి తెలుసుకున్న వెంటనే కోస్ట్‌ గార్డ్‌ నౌకలు, డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వేళ అనుకూలించని వాతావరణంలో రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. ముంబైలో రిజిస్టర్‌ అయిన రవాణా నౌక ఎంవీ ఐటీటీ ప్యూమా కోల్‌కతా నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు బయలుదేరింది. ఆగస్ట్‌ 25న సాగర్ ద్వీపానికి దక్షిణంగా 90 నాటికల్ మైళ్ల దూరంలోని సముద్రంలో అది మునిగిపోయింది.

కాగా, ఆ షిప్‌లో ఉన్న 11 మంది సిబ్బంది సహాయం కోసం డిస్ట్రెస్ సిగ్నల్స్‌ పంపారు. లైఫ్‌ జాకెట్లు వేసుకుని రెండు ర్యాఫ్ట్‌లపై సహాయం కోసం ఎదురుచూశారు. చైన్నైలోని మారిటైమ్ సెర్చ్, రెస్క్యూ కోఆర్డినేషన్ సెంటర్ ఆగస్ట్ 25 సాయంత్రం డిస్ట్రెస్ సిగ్నల్‌ను ఆలస్యంగా అందుకుంది. కోల్‌కతాలోని ఇండియన్ కోస్ట్ గార్డ్ ప్రాంతీయ ప్రధాన కార్యాలయాన్ని అప్రమత్తం చేసింది.

మరోవైపు కోస్ట్‌గార్డ్‌కు చెందిన నౌకలు సారంగ్, అమోఘ్‌తోపాటు డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో అక్కడకు చేరుకున్నారు. రాత్రి వేళ సవాల్‌తో కూడిన వాతావరణ పరిస్థితుల్లో కోస్ట్‌ గార్డ్‌ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టారు. అధునాతన నైట్ సామర్థ్యం ఉన్న సెన్సార్‌లతో కూడిన డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్ ద్వారా ర్యాఫ్ట్‌లలో ఉన్న 11 మంది సిబ్బందిని గుర్తించారు. కోస్ట్‌గార్డ్‌ నౌకలు వారి వద్దకు చేరుకోగా సురక్షితంగా రక్షించినట్లు కోస్ట్‌ గార్డ్‌ తెలిపింది. ఈ రెస్క్యూకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News