CRICKET: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ కొత్త చరిత్ర

పాకిస్థాన్‌ కడ్డపై ఆ దేశంపైనే తొలి విజయం... విస్తుపోయిన క్రికెట్‌ ప్రపంచంCRICKET: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ కొత్త చరిత్ర

Aug 26, 2024 - 09:55
Aug 26, 2024 - 09:56
 0  5
CRICKET: టెస్టుల్లో బంగ్లాదేశ్‌ కొత్త చరిత్ర

పాక్ గడ్డపై బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది. టెస్టుల్లో పాక్‌ను టెస్ట్ చరిత్రలో తొలిసారిగా ఓడించింది. బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉన్న పాక్ జట్టును బంగ్లా ఆటగాళ్లు చిత్తుగా ఓడించారు. పది వికెట్ల తేడాతో నెగ్గి హిస్టరీ క్రియేట్ చేశారు. అతి విశ్వాసం ఓటమిని చూపెట్టింది. పాక్ మొదటి ఇన్నింగ్స్లో డిక్లేర్ ఇవ్వడమే ఓటమి అంచులకు చేర్చింది. అలాగే బంగ్లా ఆటగాళ్లు ఇటు బ్యాటింగ్, అటూ బౌలింగ్లోనూ రాణించి, సమిష్టి పట్టుదలతో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నారు. రావల్పిండి వేదికగా జరిగిన తొలి మ్యాచ్లో ఆదివారం పాకిస్తాన్‌పై 10 వికెట్ల తేడాతో నెగ్గింది. అంతేకాకుండా, సొంతగడ్డపై టెస్టుల్లో పాక్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తొలి జట్టుగా కూడా రికార్డు నెలకొల్పింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 448/6 స్కోర్ వద్ద డిక్లేర్డ్ ఇవ్వగా.. బంగ్లా 565 పరుగులు చేసి 117 పరుగుల ఆధిక్యం సాధించింది.

ఇక రెండో ఇన్నింగ్స్‌లో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఓవర్ నైట్ స్కోరు 23/1‌తో చివరి రోజు ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 146 పరుగులకే అలౌట్ అయ్యింది. బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్(4/21), షకీబ్(3/44) బంతితో ప్రత్యర్థి పతనాన్ని చవిచూశారు. రిజ్వాన్(51) మినహా అందరూ పెవిలియన్కు క్యూ కట్టారు. పాక్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని తీసివేయగా బంగ్లా ముందు 30 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. స్వల్ప లక్ష్యాన్ని బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా అలవోకగా సాధించింది. ముష్ఫికర్ రహీమ్(191) భారీ ఇన్నింగ్స్‌తో, మెహిది హసన్ మిరాజ్(77, 5 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో బంగ్లా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో బంగ్లా జట్టు రెండు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం పొందింది.

ఈ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ జట్టు భారీ ఆధిక్యాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. అంతకుముందు బంగ్లాదేశ్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉండేది. కాగా.. పాకిస్తాన్ ఈ ఓటమితో తీవ్రంగా నష్టపోయింది. ఆ జట్టు ఏడో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇదిలా ఉంటే.. భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా రెండు, మూడో స్థానంలో న్యూజిలాండ్ కొనసాగుతుంది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News