CRICKET: మహిళల టీ 20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే

భారత్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం... మరోసారి కప్పుపై ఆశలు

Aug 28, 2024 - 09:32
 0  2
CRICKET: మహిళల టీ 20 ప్రపంచకప్‌.. భారత జట్టు ఇదే

మహిళల టీ20 ప్రపంచకప్ 2024 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో అక్టోబర్ 3 నుండి జరుగనుంది. దీని కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) జట్టును ప్రకటించింది. ఈ గ్లోబల్ టోర్నీలో భారత్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. అక్టోబర్ 4 న న్యూజిలాండ్ మహిళల క్రికెట్ జట్టుతో భారత్ ప్రపంచ కప్‌లో ప్రారంభిస్తుంది. యూఏఈ వేదికగా అక్టోబర్‌లో జరిగే మహిళల టీ20 వరల్డ్‌కప్‌ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.

అక్టోబర్ 4న దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ ఆడనుంది. దీని తర్వాత అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో, అక్టోబర్ 9న శ్రీలంకతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌లు కూడా దుబాయ్‌లో మాత్రమే జరగనున్నాయి. భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో తలపడనుంది. షార్జా వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. భారత్‌కు చెందిన ఈ గ్రూప్ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి. జట్టు : హర్మన్‌ప్రీత్ కౌర్ (C), స్మృతి మంధాన (VC), షఫాలీ, దీప్తి శర్మ, రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతీ రెడ్డి, రేణుకా సింగ్, దయాళన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్. ట్రావెలింగ్ రిజర్వ్‌: ఉమా ఛెత్రి, తనుజా కన్వర్, సైమా ఠాకూర్.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

RMB Live News - Darsi Live News RMB News | Telugu News | Latest Telugu News | Darsi Live News