CT Ravi | భూములు దిగమింగి కాంగ్రెస్ హైకమాండ్‌కు భారీ ముడుపులు : బీజేపీ
CT Ravi : కర్నాటకలో కాంగ్రెస్ అగ్రనేతల భూఆక్రమణల ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్‌లో కూరుకుపోగా తాజాగా ఆ పార్టీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మెడకూ భూముల కేటాయింపు వ్యవహారం చుట్టుకుంటోంది.
CT Ravi : కర్నాటకలో కాంగ్రెస్ అగ్రనేతల భూఆక్రమణల ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య ముడా స్కామ్‌లో కూరుకుపోగా తాజాగా ఆ పార్టీ జాతీయ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మెడకూ భూముల కేటాయింపు వ్యవహారం చుట్టుకుంటోంది. బెంగళూర్‌కు సమీపంలోని ఏరోస్పేస్ పార్క్‌లో ఖర్గే కుటుంబసభ్యులు నిర్వహించే ట్రస్ట్‌కు భూముల కేటాయింపునకు గ్రీన్‌సిగ్నల్ లభించడం దుమారం రేపుతోంది.
నిబంధనలకు విరుద్ధంగా ఖర్గే కుటుంబసభ్యులకు భూ కేటాయింపులు జరిపారని బీజేపీ భగ్గుమంటోంది. మూడేండ్ల కిందట కర్నాటకలో బీజేపీ అధికారంలో ఉండగా భూముల కేటాయింపులో స్కామ్ జరిగిందని కాంగ్రెస్ నానా రాద్ధాంతం చేసిందని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ భారీ భూదందాకు తెరలేపిందని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి ఆరోపించారు. 3677 ఎకరాల భూమిని ఎకరాకు కేవలం రూ. 1.22 లక్షలకు కట్టబెట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారని అన్నారు.
కర్నాటక సీఎం అనుసరించే సోషలిజం అంటే పేదల నుంచి భూములు గుంజుకుని వాటిని పెద్దలకు కట్టబెట్టడమేనా అని ఆయన ప్రశ్నించారు. ఇవాళ మార్కెట్ రేటు ప్రకారం ఎకరం కనీసం రూ. 30 లక్షలు ఉంటుందని అన్నారు. కాంగ్రెస్, ఆ పార్టీ హైకమాండ్ కారుచౌకగా భూములు కట్టబెడుతూ భారీ ముడుపులు అందుకుంటున్నాయని తన సందేహమని సీటీ రవి ఆరోపించారు.
What's Your Reaction?