Darshan in Jail జైలులో దర్శన్ కు రాజభోగాలు.. ప్రభుత్వం సీరియస్
అభిమాని రేణుకా స్వామి హత్య కేస్ లో ప్రధాన ముద్దాయిగా కర్ణాటక జైలులో ఉన్నాడు అక్కడి టాప్ హీరో దర్శన్. ఫ్యాన్స్ డి బాస్ గా చెప్పుకునే దర్శన్ చాలా యేళ్లుగా అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. చివరికి తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టాడని తన అభిమానినే హత్య చేశాడు. ఈ కేస్ లో ప్రస్తుతం దర్శన్ బెంగళూరు జైలులో ఉన్నాడు. అయితే పేరుకు జైలే అయినా అతనికి అన్ని రాచ మర్యాదలూ జరుగుతున్నాయని తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది. అంతే కాదు.. ధర్మ అనే గ్యాంగ్ స్టర్స్ తో మంతనాలు జరుపుతూ వీడియో కాల్ లో మాట్లాడిన వీడియోస్ కూడా బయటకు రావడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.జైలులో అందరూ సమానమే. ఎవరికీ ప్రత్యేక మర్యాదలు ఉండవు. కోర్ట్ నుంచి ప్రత్యేకమైన అనుమతులు ఉంటే తప్ప వారిని స్పెషల్ గా చూడరు. దర్శన్ కూడా తనను ప్రత్యేకంగా చూడాలని కోర్ట్ లో పిటిషన్ వేసుకున్నాడు. ఇంటిఫుడ్ కావాలని డిమాండ్ చేశాడు. బట్ కోర్ట్ పట్టించుకోలేదు. అందరితో సమానంగా ఉండాలని చెప్పింది. అవసరమైతే జైలులో ఫుడ్ క్వాలిటీ పెంచడానికి అనుమతి ఇస్తాం కానీ ఇంటి ఫుడ్ ను యాక్సెప్ట్ చేయం అని చెప్పింది. ఇంత జరిగినా అతనికి రాజ మర్యాదలు జరుగుతుండటంతో జైళ్ల శాఖ ఇంటిగ్రిటీనే ప్రశ్నిస్తుంది. ఈ ఘటనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ జైలుకు బాధ్యులుగా ఉన్న ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాక లోపల ఏం జరుగుతుంది అనేదానిపై దర్యాప్తుకూ ఆదేశించింది. మొత్తంగా దర్శన్ జైలులో కూడా హీరోనే అని ఫీలవడం మరింత ప్రాబ్లమ్స్ తెచ్చేలా ఉంది. అన్నట్టు ఇదే కేస్ లో మరో ప్రధాన నిందితురాలుగా ఉన్న అతని ప్రియురాలు పవిత్ర గౌడ సైతం జైలులోనే ఉంది. మరి ఆవిడకు ఎలాంటి భోగాలు అందుతున్నాయో..
అభిమాని రేణుకా స్వామి హత్య కేస్ లో ప్రధాన ముద్దాయిగా కర్ణాటక జైలులో ఉన్నాడు అక్కడి టాప్ హీరో దర్శన్. ఫ్యాన్స్ డి బాస్ గా చెప్పుకునే దర్శన్ చాలా యేళ్లుగా అనేక వివాదాల్లో చిక్కుకున్నాడు. చివరికి తన ప్రియురాలికి అసభ్యకరమైన మెసేజ్ లు పెట్టాడని తన అభిమానినే హత్య చేశాడు. ఈ కేస్ లో ప్రస్తుతం దర్శన్ బెంగళూరు జైలులో ఉన్నాడు. అయితే పేరుకు జైలే అయినా అతనికి అన్ని రాచ మర్యాదలూ జరుగుతున్నాయని తాజాగా ఒక వీడియో బయటకు వచ్చింది. అంతే కాదు.. ధర్మ అనే గ్యాంగ్ స్టర్స్ తో మంతనాలు జరుపుతూ వీడియో కాల్ లో మాట్లాడిన వీడియోస్ కూడా బయటకు రావడంతో పోలీస్ శాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
జైలులో అందరూ సమానమే. ఎవరికీ ప్రత్యేక మర్యాదలు ఉండవు. కోర్ట్ నుంచి ప్రత్యేకమైన అనుమతులు ఉంటే తప్ప వారిని స్పెషల్ గా చూడరు. దర్శన్ కూడా తనను ప్రత్యేకంగా చూడాలని కోర్ట్ లో పిటిషన్ వేసుకున్నాడు. ఇంటిఫుడ్ కావాలని డిమాండ్ చేశాడు. బట్ కోర్ట్ పట్టించుకోలేదు. అందరితో సమానంగా ఉండాలని చెప్పింది. అవసరమైతే జైలులో ఫుడ్ క్వాలిటీ పెంచడానికి అనుమతి ఇస్తాం కానీ ఇంటి ఫుడ్ ను యాక్సెప్ట్ చేయం అని చెప్పింది. ఇంత జరిగినా అతనికి రాజ మర్యాదలు జరుగుతుండటంతో జైళ్ల శాఖ ఇంటిగ్రిటీనే ప్రశ్నిస్తుంది. ఈ ఘటనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఆ జైలుకు బాధ్యులుగా ఉన్న ఏడుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాక లోపల ఏం జరుగుతుంది అనేదానిపై దర్యాప్తుకూ ఆదేశించింది. మొత్తంగా దర్శన్ జైలులో కూడా హీరోనే అని ఫీలవడం మరింత ప్రాబ్లమ్స్ తెచ్చేలా ఉంది.
అన్నట్టు ఇదే కేస్ లో మరో ప్రధాన నిందితురాలుగా ఉన్న అతని ప్రియురాలు పవిత్ర గౌడ సైతం జైలులోనే ఉంది. మరి ఆవిడకు ఎలాంటి భోగాలు అందుతున్నాయో..
What's Your Reaction?