Darshan : బళ్లారి జైలుకు దర్శన్ .. బెంగళూరు కోర్టు ఆదేశాలతో తరలింపు
అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైలులో రాచమర్యాదలు లభిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకొంది. దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చినట్లు తాజా సమాచారం.పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్‌ను.. బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులను కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించనున్నట్లు సమాచారం. జైలులో దర్శన్‌కు సంబంధించిన ఫొటో ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడం ఈ పరిణామానికి దారి తీసినట్లు తెలుస్తోంది.దర్శన్ జైలు బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. రౌడీషీటర్ వేలు.. ఆ ఫొటోను తన సెల్‌ఫోన్‌లో తీసి బయట ఉన్న భార్య సెల్‌ఫోన్‌కు పంపించినట్లు తెలుస్తోంది. దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీషీటర్ విల్సన్‌గార్డన్ నాగ కూడా ఉన్నాడు.

What's Your Reaction?